జన్‌ధన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. బీమా పధకం రూ. 1.30 లక్షల వరకు ప్రయోజనాలు.. వివరాలివే..
ఈ కరోనా కష్టకాలంలో జన్‌ధన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. బీమా పధకం కింద ఆర్ధిక ప్రయోజనాలు పొందవచ్చు. ఆ బెనిఫిట్స్ గురించి ఇప్పటికీ..
ఈ కరోనా కష్టకాలంలో జన్‌ధన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. బీమా పధకం కింద ఆర్ధిక ప్రయోజనాలు పొందవచ్చు. ఆ బెనిఫిట్స్ గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు. 2014లో మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత పీఎం జన్‌ధన్ యోజన (పీఎంజెడీవై)ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ పధకంలో భాగంగా ప్రతీ పౌరుడికి బ్యాంకులో జన్‌ధన్ ఖాతా తెరవడానికి సౌకర్యం కల్పించింది. ఇదిలా ఉంటే జన్‌ధన్ ఖాతాకు చాలా ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. వాటి గురించి నేటికీ చాలామందికి తెలియదు. ఈ కరోనా సంక్షోభ సమయంలో ఆ ప్రయోజనాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
బీమా పథకం కింద రూ .1.30 లక్షల ప్రయోజనం…
ప్రతి జన్‌ధన్ ఖాతాదారునికి మొత్తం 1.30 లక్షల రూపాయల వరకు ప్రయోజనం లభిస్తుంది. ఇందులో ప్రమాద బీమా కూడా ఉంది. ఖాతాదారునికి లక్ష రూపాయల ప్రమాద బీమాతో పాటు రూ .30,000 సాధారణ బీమా ఇవ్వబడుతుంది, ఇది అతడు/ఆమె ప్రమాదానికి గురైనప్పుడు ఖాతాదారునికి ఇవ్వబడుతుంది.
జీరో బ్యాలెన్స్ ఖాతా తెరవడం వల్ల కలిగే ప్రయోజనాలు…
జన్‌ధన్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రశంసించిన సందర్భాలు కోకొల్లలు. ఈ పథకం బ్యాంకింగ్ / పొదుపు, డిపాజిట్ ఖాతాలు, రుణాలు, బీమా, సామాన్యులు పెన్షన్ పొందేలా చేస్తుంది. జీరో బ్యాలెన్స్ సౌకర్యం ఉన్న ఈ ప్రత్యేక ఖాతాను మీ ఇంటికి సమీపంలో ఉన్న ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో తెరవవచ్చు.
ప్రమాద బీమా…
ఈ ఖాతాలో మీరు డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీని పొందుతారు. వినియోగదారులకు మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం ఉచితంగా లభిస్తుంది. ఈ ఖాతాలో ప్రభుత్వం రూ .10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తుంది.
ఇవి కూడా చదవండి:
బాల్కానీలో దంపతుల ఫైట్.. అంతలోనే ఘోరం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!
తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
ప్రపంచంలోనే వింతైన వంటకాలు.. చూస్తేనే వాంతి వస్తుంది.. తినడానికి కూడా ధైర్యం చెయ్యరు.!