ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా..? జైలుకు వెళ్లాల్సిందే..!

ITR Filing: 2021-22 ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు (ITR Filing)చేయడానికి చివరి తేదీ మార్చి31, 2022. అయితే 2021 డిసెంబర్‌ 31 వరకు..

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా..? జైలుకు వెళ్లాల్సిందే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 29, 2022 | 6:00 AM

ITR Filing: 2021-22 ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు (ITR Filing)చేయడానికి చివరి తేదీ మార్చి31, 2022. అయితే 2021 డిసెంబర్‌ 31 వరకు ఉన్న గడువును మార్చి 31 వరకు పెంచింది ఆదాయపు పన్ను (Income Tax) శాఖ. గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. గడువు తర్వాత ఐటీఆర్‌ (ITR) దాఖలు చేసినట్లయితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే జరిమానా (Penalty) లేదా కనీసం మూడు సంవత్సరాల పాటు జైలు (Jail) శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆదాయపు పన్ను నిపుణుడు బల్వంత్‌ జైన్‌ మాట్లాడుతూ.. ఆదాయపు పన్నుకు సంబంధించిన ఐటీఆర్‌ రిటర్న్‌ దాఖలు చేయడంలో విఫలమైనట్లయితే వడ్డీతో పాటు ఆదాయపు పన్ను శాఖ 50 శాతం నుంచి 200 శాతం వకు జరిమానా విధించవచ్చని అన్నారు. డిపార్ట్‌మెంట్ నుండి ఆదాయపు పన్ను నోటీసుకు ప్రతిస్పందనగా పన్నుచెల్లింపుదారుడు తన ITRని దాఖలు చేసే తేదీ వరకు బాధ్యత వహిస్తాడు. చివరి తేదీలోగా ITR ఫైల్ చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారుపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయన్నారు. ఆదాయపు పన్ను నిబంధనలను ఆయన వివరించారు. ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. ఐటీఆర్‌ రిటర్న్‌ దాఖలు చేయడంలో విఫలమైతే కనీసం 3 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు.

గడువు తేదీ తర్వాత కానీ చివరి తేదీకి ముందు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు ఆలస్య రుసుము గురించి మాట్లాడారు. పన్ను చెల్లింపుదారు 31 డిసెంబరు 2021 వరకు గడువు విధించగా, తర్వాత ఆ గడువును పెంచింది. ITR చివరి తేదీ 2022 మార్చి 31 నాటికి తన ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. పన్ను చెల్లింపుదారు తన వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ITR ఫైల్ చేసే సమయంలో రూ. 5,000 ఆలస్య రుసుము చెల్లించాలి. ఒకవేళ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే ఆలస్య రుసుము తగ్గుతుంది. కేవలం రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ఇవి కూడా చదవండి:

Post Office: మీరు పోస్ట్ ఆఫీసులో అకౌంట్‌ తీయాలనుకుంటున్నారా..? ఈ నిబంధనలు తప్పనిసరి..!

Banking News: మూడవ త్రైమాసికంలో ఆ బ్యాంకు లాభాలు రెట్టింపు.. జనవరిలో పెరిగిన చార్జీలు..!

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా