Aadhaar : మీ ఆధార్ నకిలీదా లేదా నిజమైందా..! ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఇలా సులభంగా చెక్ చేసుకోండి..

Aadhaar : ఆధార్ అత్యంత నమ్మదగిన గుర్తింపు కార్డు. ఇది ప్రతిరోజూ వివిధ రకాల పని కోసం ఉపయోగిస్తారు. ఇది లేకపోతే మీరు చాలా

Aadhaar : మీ ఆధార్ నకిలీదా లేదా నిజమైందా..! ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఇలా సులభంగా చెక్ చేసుకోండి..
Aadhaar
Follow us

|

Updated on: Jul 14, 2021 | 2:55 PM

Aadhaar : ఆధార్ అత్యంత నమ్మదగిన గుర్తింపు కార్డు. ఇది ప్రతిరోజూ వివిధ రకాల పని కోసం ఉపయోగిస్తారు. ఇది లేకపోతే మీరు చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ప్రస్తుత రోజులలో ప్రతి చిన్న పనికి ఆధార్ కార్డు అవసరం. ఆధార్ నంబర్ లేకపోతే చాలా పనులు నిలిచిపోతాయి. ఆధార్ సంఖ్య మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని చెప్పవచ్చు. తాజాగా ఆధార్‌కు సంబంధించిన అనేక కేసులు తెరపైకి వస్తున్నాయి. అందుకే యూఐడీఏఐ వినియోగదారులను హెచ్చరిస్తుంది. మీ ఆధార్ కార్డు నకిలీదా లేదా నిజమైనదా ఒక్కసారి చెక్ చేసుకోండని సూచిస్తుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

UADAI తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆధార్ మోసం గురించి ప్రజలను హెచ్చరించింది. ఆధార్ పేరిట మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏజెన్సీ తెలిపింది. మీ ఆధార్ నిజమైనదా, నకిలీదా అని మీరు ఎలా తనిఖీ చేయవచ్చో ట్విట్టర్ ద్వారా తెలిపింది. పూర్తిగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డును ధృవీకరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో మీరు ఆధార్‌కు సంబంధించిన ఏ సమస్యకైనా పరిష్కారం పొందవచ్చు. ఆధార్ ఆఫ్‌లైన్‌లో తనిఖీ చేయడానికి దాని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని యుఐడిఎఐ తెలిపింది. ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడానికి, రెసిడెంట్.యూడై.గోవ్.ఇన్ / వెరిఫై లింక్‌ను సందర్శించడం ద్వారా 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. మీకు కావాలంటే ఈ పనిని m-Aadhaar యాప్ ద్వారా కూడా చేయవచ్చు.

Cabinet: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. ఏడాది తర్వాత ఒకేచోటకు చేరిన మంత్రులు..!

Telangana Jobs: యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కొత్త ప్రణాళిక.. రాతపరీక్షలు నిర్వహించే ఆలోచనలో తెలంగాణ సర్కార్

Steel Plant: ఇలా.. చేసి వైజాగ్ స్టీల్‌ను లాభాల్లోకి తీసుకురండి.. జాతి సంపద ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వడం సరికాదు : విజయసాయిరెడ్డి

Dubbaka: జంపింగ్ జపాంగ్‌లు.. నిన్న బీజేపీ.. నేడు టీఆర్ఎస్.. గంటల్లోనే పార్టీలు మారిన కౌన్సిలర్లు