AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cabinet: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. ఏడాది తర్వాత ఒకేచోటకు చేరిన మంత్రులు..!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగనున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి బుధవారంనాడు భేటీ అయ్యింది.

Cabinet: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. ఏడాది తర్వాత ఒకేచోటకు చేరిన మంత్రులు..!
Union Cabinet
Balaraju Goud
|

Updated on: Jul 14, 2021 | 2:53 PM

Share

PM Narendra Modi chairs Union cabinet meet: చాలా రోజుల తర్వాత వర్చువల్‌ తరహాలో కాకుండా ఫిజికల్‌గా కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగనున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి బుధవారంనాడు భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధికారం నివాసంలో ఈ సమావేశం జరిగింది. వర్చువల్‌ తరహాలో కాకుండా ఫిజికల్‌గా జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అందరూ హాజరయ్యారు.

కేంద్ర కేబినెట్ మీటింగ్ జరగడం ఏడాది తర్వాత ఇదే ప్రథమం. జూలై 7న మంత్రి వర్గ పునర్వవస్థీకరణ తర్వాత మంత్రులంతా సమావేశం కావడం కూడా ఇదే మొదటిసారి. రెండు రోజుల క్రితం కేబినెట్ కమిటీలను పునర్వవస్థీకరించిన తర్వాత ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా కొత్త, పాత మంత్రులు ప్రధాని మోదీ దిశానిర్ధేశం చేశారు. ముఖ్యంగా కోవిడ్‌పై పోరాటంలో ఎలాంటి అలసత్వం వద్దని మంత్రులకు ప్రధాని సూచించారు. ప్రజలు మాస్కులు లేకుండా సామాజిక దూరం పాటించకుండా రద్దీ ప్రాంతాల్లో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. దీంతో మరోసారి దేశవ్యాప్తంగా అందరిలోనూ ఒకతరహా భయం నెలకొంటోందని అన్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను ప్రజలు పాటించకపోవడం మంచిది కాదన్నారు. కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 19న ప్రారంభమై ఆగస్టు 13తో ముగుస్తాయి.

Read Also….  Telangana Jobs: యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కొత్త ప్రణాళిక.. రాతపరీక్షలు నిర్వహించే ఆలోచనలో తెలంగాణ సర్కార్