‘హార్డ్‌వేర్ ఎగుమతుల్లో భారత్‌ దూకుడు..’ FIEO సీఈవో కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్ హార్డ్‌వేర్ ఫెయిర్ 2024 రెండవ ఎడిషన్ డిసెంబర్ 6న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) డైరెక్టర్ జనరల్, సీఈవో అజయ్ సహాయ్ చేతుల మీదగా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారత్ హార్డ్‌వేర్ ఎగుమతుల్లో వేగంగా వృద్ధిని సాధిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

'హార్డ్‌వేర్ ఎగుమతుల్లో భారత్‌ దూకుడు..' FIEO సీఈవో కీలక వ్యాఖ్యలు
Hardware Exports In India
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 08, 2024 | 12:34 PM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 8: హార్డ్‌వేర్ ఎగుమతులకు భారత్ సిద్ధంగా ఉందని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) సీఈవో అశ్వనీ కుమార్ శనివారం తెలిపారు. ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్ హార్డ్‌వేర్ ఫెయిర్ ఇండియా రెండో ఎడిషన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ పలు కీలక విషయాలు పంచుకున్నారు. దేశ దృక్పథానికి అనుగుణంగా ఈ ఈవెంట్ ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊహించిన విధంగా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్ మారబోతుందని అన్నారు. తయారీ, నిర్మాణం సాంకేతికత వంటి పరిశ్రమలలో హార్డ్‌వేర్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. హార్డ్‌వేర్ ఎగుమతుల్లో భారత్ 2023లో 15% వార్షిక వృద్ధిని సాధించిందని, 2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సామూహిక దృక్పథంతో, బలమైన వృద్ధి పథం, వ్యూహాత్మక ప్రభుత్వ కార్యక్రమాలతో భారత్‌ ప్రపంచ దేశాల్లో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు పొందిందని ఆయన అన్నారు.

భారతదేశ ఎగుమతి ఊపందుకుంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) డైరెక్టర్ జనరల్, సీఈవో అజయ్ సహాయ్ అన్నారు. భారత్‌ గణనీయమైన ఎగుమతి వృద్ధికి సిద్ధంగా ఉంది. 2030 నాటికి 2 ట్రిలియన్ల డాలర్ల లక్ష్యంతో ఉంది. ఇటీవలి సంవత్సరాలలో మా ఎగుమతులు 478 బిలియన్ డాలర్ల నుంచి 778 బిలియన్‌ డాలర్లకు ఎగబాకాయన్నారు. ఇది 8% వార్షిక వృద్ధి రేటును సూచిస్తుందని అన్నారు. ఇదే ఈ వేగాన్ని కొనసాగించడానికి తాము 14% CAGR లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశ సపోర్టివ్‌ ఎకోసిస్టమ్‌, సాంకేతిక నైపుణ్యాల కారణంగా దీనిని సాధించవచ్చని అతను అన్నారు. అనంతరం Koelnmesse Pvt Ltd మేనేజింగ్ డైరెక్టర్ మిలింద్ దీక్షిత్ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి, పెరిగిన మౌలిక సదుపాయాల వ్యయంతో, హార్డ్‌వేర్, నిర్మాణ సామగ్రికి డిమాండ్ పెరుగుతోందన్నారు.

ఇంటర్నేషనల్ హార్డ్‌వేర్ ఫెయిర్ 2024 రెండవ ఎడిషన్ డిసెంబర్ 6న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రారంభమైంది. ప్రారంభోత్సవ వేడుకకు FIEO అధ్యక్షుడు Mr అశ్వనీ కుమార్‌తో సహా ప్రముఖ ప్రముఖులు హాజరయ్యారు. చైనా, కొరియా, ఇటలీ, తైవాన్ నుంచి దాదాపు 250 మంది ఎగ్జిబిటర్స్‌, అంతర్జాతీయ పెవిలియన్లు, 35 దేశాల నుండి పది వేలకుపైగా ట్రేడ్‌ విజిటర్స్‌ పాల్గొన్నారు. భారతదేశ ఫర్నిచర్ హార్డ్‌వేర్ మార్కెట్ 2024 నుంచి 2029 వరకు 15.49 శాతం (CAGR) వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. 2024లో 3.04 బిలియన్‌ డాలర్ల నుండి 6.26 బిలియన్ డాలర్లకు విస్తరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.