PM Kisan: పీఎం కిసాన్‌ స్కీమ్‌లో రూ.6000 నుంచి రూ.12000కి పెంచనున్నారా?

PM Kisan: రైతు ప్రతినిధులతో రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు. ఆర్థిక ఉపశమనం..

PM Kisan: పీఎం కిసాన్‌ స్కీమ్‌లో రూ.6000 నుంచి రూ.12000కి పెంచనున్నారా?
Follow us
Subhash Goud

|

Updated on: Dec 08, 2024 | 12:48 PM

దేశంలోని ప్రతి రైతుకు పీఎం కిసాన్‌ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాది రూ.6000 చొప్పున అందుకుంటున్నారు. మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. రైతు ప్రతినిధులు బడ్జెట్ (బడ్జెట్ 2025) ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రితో జరిగిన సంభాషణలో రైతు ప్రతినిధులు చౌకగా దీర్ఘకాలిక రుణాలు అందించాలని, తక్కువ పన్ను విధించాలని, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: ATM Card: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఏటీఎం కార్డులు బ్లాక్‌.. కారణం ఏంటో తెలుసా?

రైతు ప్రతినిధులతో రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు. ఆర్థిక ఉపశమనం, మార్కెట్ సంస్కరణలు, వ్యూహాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టాలనేది ఇందులో ప్రధాన డిమాండ్లు. వ్యవసాయ ఉత్పాదకత, రైతు సంక్షేమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని భారత్ కృషక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జాఖర్ వివరించారు.

ఇవి కూడా చదవండి

వడ్డీ రేటును 1 శాతానికి తగ్గించాలని డిమాండ్‌

ఈ సమయంలో ఆర్థిక మంత్రికి చేసిన ప్రధాన డిమాండ్లలో వ్యవసాయ రుణంపై వడ్డీ రేటును 1 శాతానికి తగ్గించడం, పీఎం-కిసాన్ సమ్మాన్ నిధిని సంవత్సరానికి రూ. 6,000 నుండి రూ. 12,000కి పెంచడం వంటివి ఉన్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. అలాగే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద చిన్న రైతులకు జీరో ప్రీమియం పంట బీమాను కూడా రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. పన్నుల సంస్కరణ కింద వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, మందులపై జిఎస్‌టి మినహాయింపు ఇవ్వాలని వాటాదారులు డిమాండ్ చేశారు.

జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని డిమాండ్:

పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పురుగుమందులపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేసింది. ఎనిమిదేళ్లపాటు ఏటా రూ.1,000 కోట్ల పెట్టుబడి వ్యూహాన్ని జాఖర్ ప్రతిపాదించారు. ఇది జాతీయ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి సోయాబీన్, ఆవాలు వంటి నిర్దిష్ట పంటలపై దృష్టి పెడుతుంది. భారతీయ కిసాన్ యూనియన్ (BKU) అధ్యక్షుడు ధర్మేంద్ర మాలిక్ కనీస మద్దతు ధర (MSP) యంత్రాంగాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు. భూమి అద్దె, వ్యవసాయ వేతనాలు, పంట కోత తర్వాత ఖర్చులను చేర్చాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Luxurious House: లగ్జరీ ఇల్లు కొన్న నారాయణమూర్తి.. ధర ఎంతో తెలిస్తే షాక్‌.. అక్కడే విజయ్‌ మల్యా

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి