BSNL: గుడ్‌న్యూస్.. సెట్-టాప్ బాక్స్ లేకుండా ఉచితంగా 500 కంటే ఎక్కువ HD టీవీ ఛానెళ్లు, OTT యాప్స్
Skypro అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ సర్వీస్ (IPTV) సర్వీస్ ప్రొవైడర్. ఇది అనేక ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్..
ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యూజర్లకు శుభవార్త చెప్పింది. ఎలాంటి కేబుల్ టీవీ అవసరం లేకుండా సెట్-టాప్ బాక్స్ లతో పనిలేకుండా ఏకంగా 500 కంటే ఎక్కువ హెచ్‌డీ టీవీ ఛానెల్స్, OTT యాప్స్ తో BSNL ఉచిత టీవీ సర్వీసులను ప్రారంభించింది. ఇది దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులో ఉండగా, త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.
టీవీ స్ట్రీమింగ్ కోసం ఉపయోగించే డేటా వారి డేటా ప్యాక్‌ల నుండి వేరుగానే ఉంటుందని, ఎఫ్‌టీటీహెచ్ (FTTH) ప్యాక్ నుండి తీసివేయడం అనేది ఉండదని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. అంటే స్ట్రీమింగ్ కోసం అపరిమిత డేటాను అందిస్తుంది. లైవ్ టీవీ సేవ BSNL FTTH కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని తెలిపింది.
బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల మధ్యప్రదేశ్, తమిళనాడులో దేశంలోనే మొట్టమొదటి ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఆధారిత డిజిటల్ టీవీ సర్వీస్ IFTVని ప్రారంభించింది. ప్రభుత్వ టెలికాం కంపెనీ ఇప్పుడు పంజాబ్‌లో కూడా ఈ సేవను ప్రారంభించింది. ఇందుకోసం బీఎస్‌ఎన్‌ఎల్ Skyproతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బీఎస్‌ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారులు 500 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను ఉచితంగా చూడగలరు. ఈ టీవీ ఛానెల్స్ అన్నీ హెచ్‌డి క్వాలిటీలో వినియోగదారులకు అందిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే, వినియోగదారులు 20 కంటే ఎక్కువ OTT యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను పొందుతారు.
Transforming entertainment in Punjab!
Hon’ble CMD BSNL launched today IFTV service in Punjab circle, bringing a new era of seamless connectivity and digital entertainment. BSNL redefines home entertainment with IFTV – India’s First Fiber-Based Intranet TV Service with access to… pic.twitter.com/Qtj0XxVcja
— BSNL India (@BSNLCorporate) November 28, 2024
Skypro అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ సర్వీస్ (IPTV) సర్వీస్ ప్రొవైడర్. ఇది అనేక ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి పంజాబ్ టెలికాం సర్కిల్ కోసం ఈ సేవను ప్రారంభించారు. ముందుగా ఈ సేవ చండీగఢ్‌లోని 8,000 మంది బీఎస్‌ఎన్‌ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు అందించనున్నారు. దీని తర్వాత, మొత్తం పంజాబ్‌లోని బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఈ సేవ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది మాత్రమే కాదు, బ్రాడ్‌బ్యాండ్ సేవలు త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది.
సెట్-టాప్ బాక్స్ లేకుండా ఛానెల్స్:
Skypro ఈ స్ట్రీమింగ్ సేవలో వినియోగదారులు స్టార్, సోనీ, జీ, కలర్స్ దాదాపు అన్ని టీవీ ఛానెల్‌లను ఉచితంగా చూడవచ్చు. ఇది కాకుండా, SonyLIV, Zee5, Disney+ Hotstar వంటి 20 కంటే ఎక్కువ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సర్వీస్ ప్రత్యేకత ఏమిటంటే, వినియోగదారులు ఎటువంటి సెట్-టాప్ బాక్స్ లేకుండా అన్ని ప్రత్యక్ష టీవీ ఛానెల్‌లను చూడవచ్చు. వినియోగదారులు తమ స్మార్ట్ టీవీలో స్కైప్రో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్‌కి కనెక్ట్ అయిన వెంటనే ఈ టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేయవచ్చు.
टेलीकॉम सेवाओं (4G) से जुड़ा भारत का पहला गांव
📍पिन वैली, हिमाचल प्रदेश pic.twitter.com/of4UDRWnHo
— DoT India (@DoT_India) December 1, 2024
దేశంలోని మొదటి గ్రామానికి 4జీ సేవలు:
దేశంలోని మొట్టమొదటి గ్రామమైన పిన్ వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ 4G సేవలను ప్రారంభించింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం తన X హ్యాండిల్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. దేశంలో ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా 4G సేవ అందించబడుతోంది. 4G సేవ ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లోని పిన్ వ్యాలీ గ్రామ ప్రజలు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం మొత్తానికి సులభంగా కనెక్ట్ కాగలుగుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి