Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. నేడు 194 రైళ్ల రద్దు.. జాబితాను తనిఖీ చేయండిలా..!

Indian Railways: ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. పలు కారణాల వల్ల కొన్ని రైళ్లను రద్దు చేస్తుంటుంది. తాజాగా జూలై 14న 194 రైళ్లను రద్దు..

Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. నేడు 194 రైళ్ల రద్దు.. జాబితాను తనిఖీ చేయండిలా..!
Indian Railway
Follow us
Subhash Goud

|

Updated on: Jul 14, 2022 | 10:33 AM

Indian Railways: ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. పలు కారణాల వల్ల కొన్ని రైళ్లను రద్దు చేస్తుంటుంది. తాజాగా జూలై 14న 194 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. అలాగే 11 రైళ్లను దారి మళ్లించాలని, మరో 10 రైళ్లను రీషెడ్యూల్‌ చేయాలని నిర్ణయించింది రైల్వేశాఖ. మళ్లింపు రైలు జాబితా, రద్దు చేయబడిన రైలు జాబితా, రద్దు చేయబడిన రైళ్ల జాబితాలో మెయిల్ రైలు, ప్రీమియం, ఎక్స్‌ప్రెస్ రైలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే ముందు, ప్రయాణికులు తప్పనిసరిగా రద్దు చేయబడిన రైళ్ల జాబితాను తనిఖీ చేయడం మంచిది. లేకపోతే స్టేషన్‌కు వెళ్లిన తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఈ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున పలు ప్రాంతాల్లో వరదల పరిస్థితి తీవ్రంగా ఉంది. దీంతో రైల్వే ట్రాక్స్‌ మరమ్మతుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. ఈ రైలు పట్టాల గుండా ప్రతిరోజూ వేల సంఖ్యలో రైళ్లు ప్రయాణిస్తుంటాయి. దీంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా రైళ్లను రద్దు చేసి మరమ్మతులను చేపడుతున్నారు.

నేడు ఈ రైళ్లను రైల్వే రద్దు చేసింది:

ఇవి కూడా చదవండి

దేశంలోని అనేక ప్రాంతాలలో రైళ్లు నడుస్తున్నాయి. అయితే వాటిలో ప్రధానమైనవి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ మొదలైన రైళ్లు. రద్దయిన రైళ్లలో లక్నో-పూణె, లక్ష్మీబాయి-లక్నో, లక్నో-రాయ్‌పూర్, దుర్గ్-హజ్రత్ నిజాముద్దీన్, న్యూఢిల్లీ-సిల్చార్, లక్నో-జబల్‌పూర్ సహా మొత్తం 19 రైళ్లు రద్దు చేయబడ్డాయి. రద్దు చేసిన రైళ్ల జాబితాను తెలుసుకోవాలంటే ఇలా తనిఖీ చేయండి.

ముందుగా  వెబ్‌సైట్‌ను సందర్శించండి. తర్వాత కుడి వైపున ఉన్న ఎక్సెప్షనల్ ట్రైన్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్యాన్సిల్ ట్రైన్ లిస్ట్, రీషెడ్యూల్, డైవర్ట్ ట్రైన్స్ లిస్ట్‌లను క్లిక్ చేయడం ద్వారా ఈ మూడు జాబితాలను తనిఖీ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి