Today Petrol, Diesel Price: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా రేట్ల వివరాలు
Today Petrol, Diesel Price: క్రూడ్ ధరల పతనం కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ బుధవారం బ్యారెల్ $ 99 స్థాయికి దిగువకు చేరుకుంది. అయితే పెట్రోలు, డీజిల్ ధరలు నిలకడగా ఉండడం వాహనదారులకు ఉపశమనం..
Today Petrol, Diesel Price: క్రూడ్ ధరల పతనం కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ బుధవారం బ్యారెల్ $ 99 స్థాయికి దిగువకు చేరుకుంది. అయితే పెట్రోలు, డీజిల్ ధరలు నిలకడగా ఉండడం వాహనదారులకు ఉపశమనం అనే చెప్పాలి. చమురు కంపెనీలు జూలై 14 న పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. 7 వారాలకు పైగా గడిచినా, పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. మే 21న ప్రభుత్వం సామాన్యులకు ఊరటనిచ్చింది. అప్పటి నుంచి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96,72 ఉండగా, డీజిల్ ధర రూ.86,62 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35 ఉండగా, డీజిల్ ధర రూ.97,28 ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉండగా, డీజిల్ ధర రూ.97.82 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03 ఉండగా, డీజిల్ ధర రూ.92.76 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63 ఉండగా, డీజిల్ ధర రూ.94.24 ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94 ఉండగా, డీజిల్ ధర రూ.87.89 ఉంది.
SMS ద్వారా మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను తనిఖీ చేయండి
మీరు SMS ద్వారా మీ నగరంలో ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు. దీని కోసం, ఇండియన్ ఆయిల్ (IOCL) వినియోగదారులకు RSP కోడ్ రాసి 9224992249 నంబర్‌కు పంపండి. మీ నగరం RSP కోడ్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ఆధారంగా, చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్, డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి