Indian Railways: మీరు రైల్లో నిద్రిస్తున్నారా? అయితే జరిమానా పడుద్ది.. కొత్త నిబంధనలు!
దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే రైల్వే అని చెప్పక తప్పదు. ప్రపంచంలోనే నాలుగో రవాణా వ్యవస్థగా ఇండియన్ రైల్వేకు పేరుంది. అయితే రైలులు ప్రయాణించే ముందు ఎన్నో నిబంధనలు ఉంటాయి. వాటి గురించి అందరికి తెలియవు. నిబంధనల ప్రకారం.. ప్రయాణీకుడు మిడిల్ బెర్త్‌ను రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచవచ్చు. అంటే..
దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే రైల్వే అని చెప్పక తప్పదు. ప్రపంచంలోనే నాలుగో రవాణా వ్యవస్థగా ఇండియన్ రైల్వేకు పేరుంది. అయితే రైలులు ప్రయాణించే ముందు ఎన్నో నిబంధనలు ఉంటాయి. వాటి గురించి అందరికి తెలియవు. నిబంధనల ప్రకారం.. ప్రయాణీకుడు మిడిల్ బెర్త్‌ను రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచవచ్చు. అంటే ఆ సమయాల్లో నిద్రించేందుకు అనుమతి ఉందన్నట్లు. ఎక్కువసేపు తెరిచి ఉంచడం వల్ల లోయర్ బెర్త్‌లలో కూర్చున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి: Budget 2024: రాబోయే బడ్జెట్‌లో మోడీ సర్కార్ శుభవార్త.. రైతుల ఖాతాల్లో రూ.8 వేలు?
మీరు కూడా ఎక్కువ దూరం రైలులో ప్రయాణిస్తున్నట్లయితే, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే ఎప్పటికప్పుడు నిబంధనలను మారుస్తుంది. తాజాగా రైలులో ప్రయాణికులు నిద్రించే సమయాన్ని రైల్వేశాఖ మార్చింది. కొత్త రూల్ ప్రకారం, రైలులో ప్రయాణికుల నిద్ర సమయం మునుపటితో పోలిస్తే తగ్గిందనే చెప్పాలి. ఇంతకుముందు ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో 9 గంటల పాటు నిద్రించేవారు. కానీ ఇప్పుడు ఈ సమయాన్ని 8 గంటలకు తగ్గించారు. కొత్త రూల్ ప్రకారం, ఇప్పుడు మీరు రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు నిద్రించవచ్చు. గతంలో ఈ సమయం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉండేది.
ఇది కూడా చదవండి: Paytm Wallet: మీరు పేటీఎం వాడుతున్నారా? జూలై 20 నుంచి వాలెట్ మూసివేత
రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకే..
ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా రైల్వేశాఖ ఈ మార్పు చేసింది. ఉదయం 10 నుంచి 6 గంటల మధ్య సమయం నిద్రకు మంచిదని భావిస్తారు. ఈ నిబంధన అమలుకు ముందు మిడిల్ బెర్త్‌లపై కూర్చున్న ప్రయాణికులు రోజులో కూడా నిద్రపోతున్నారని, దీంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోందని ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో కింది సీట్లో కూర్చోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ప్రయాణికుల మధ్య వాగ్వాదం కూడా జరుగుతోంది. కొత్త నిబంధన వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఇప్పుడు నిద్రపోయే సమయం నిర్ణయించినందున, ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 6 గంటల వరకు మాత్రమే నిద్ర పోవాలి. ఈ నియమం ప్రకారం, ప్రయాణికుడు మిడిల్ బెర్త్ లో రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు నిద్రించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: SBI: కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త.. అదేంటో తెలుసా..?
కొత్త నిబంధన ప్రకారం, లోయర్ బెర్త్‌లో ప్రయాణించే రిజర్వ్‌డ్ టిక్కెట్లు కలిగిన ప్రయాణికులు రాత్రి 10 గంటలలోపు లేదా ఉదయం 6 గంటల తర్వాత తమ సీట్లపై పడుకోవడానికి ప్రయత్నించకూడదు. ప్రయాణీకులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రైల్వేకు ఫిర్యాదు చేయవచ్చు.
ఇది కూడా చదవండి: Union Budget 2024: బడ్జెట్ ప్రసంగంలో ఈ పదాల అర్థం మీకు తెలుసా? ఆసక్తికర విషయాలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి