Ambani, Adani Security: అంబానీ, ఆదానీల భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుందో తెలిస్తే షాకవుతారు!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ ఒకరు. అయితే అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు ఉండే సదుపాయాలు అంతా ఇంతా కాదు. అంబానీ ఇంట్లోకి వెళ్లాలంటే చిన్న చీమకైనా అనుమతి ఉండదని విధంగా ప్రత్యేక భద్రత ఉంటుంది. అయితే గత ఏడాది అంబానీకి ముప్పు ఉందన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతను పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఆయనకు ‘జెడ్ ప్లస్’
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ ఒకరు. అయితే అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు ఉండే సదుపాయాలు అంతా ఇంతా కాదు. అంబానీ ఇంట్లోకి వెళ్లాలంటే చిన్న చీమకైనా అనుమతి ఉండదని విధంగా ప్రత్యేక భద్రత ఉంటుంది. అయితే గత ఏడాది అంబానీకి ముప్పు ఉందన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతను పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఆయనకు ‘జెడ్ ప్లస్’ కేటగిరీ భద్రత ఉంటుంది. గత ఏడాది ఆయన నివాసం వద్ద బాంబు ఉన్నట్లు కలకలం రేగిన నేపథ్యంలో అంబానీకి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అంబానీకి ప్రత్యేక భద్రత ఉంటుంది.
గత సంవత్సరం ఆయన నివాసం ముంబైలోని ఆంటిలా వద్ద ఓ కారులో పేలుడు పదార్థాలు కనిపించిన సంగతి తెలిసిందే. ఆ కారులోని 20 జిలెటిన్ స్టిక్స్‌ను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించారు. అప్పటి అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేను ఎన్ఐఏ అరెస్టు చేసింది. దీంతో అంబానీకి జెడ్ ప్లస్ కేటగిరి కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Annual Salary: గౌతమ్ అదానీకి రూ.9.26 కోట్ల జీతం..మరి ముఖేష్ అంబానీకి వేతనం ఎంతో తెలుసా?
భద్రతకు ఎంత ఖర్చు అవుతుంది?
ముఖేష్ అంబానీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కోసం నెలకు రూ.20 లక్షలకు పైగానే ఖర్చవుతుందని సమాచారం. ఈ ఖర్చు మొత్తం అంబానీయే భరించుకోవాల్సి ఉంటుందని సమాచారం.
ఆదానీ..
అలాగే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి కూడా గత గత ఏడాదిలో నుంచే జెడ్ కేటగిరీ భద్రతను ప్రభుత్వం కల్పించింది. దీని కోసం అయ్యే ఖర్చును ఆయనే భరించుకోవాల్సి ఉంటుంది. ఆదానీ సెక్యూరిటీకి చేసే ఖర్చు రూ.20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.
జెడ్ ప్లస్ కేటగిరీలో ఎంత మంది ఉంటారు?
ఇక జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత గురించి మాట్లాడినట్లయితే.. జెడ్ ప్లస్ అనేది రెండో అత్యున్నత స్థాయి భద్రత. ఈ భద్రతగల వ్యక్తికి 55 మంది సిబ్బంది రక్షణ కల్పిస్తారు. వీరిలో సుమారు 10 మంది ఎన్ఎస్‌జీ కమాండోలు, పోలీసు ఉన్నతాధికారులు ఉంటారు. ప్రతి కమాండో మార్షల్ ఆర్ట్స్‌లో, ఆయుధాలు లేకుండా పోరాడటంలో శిక్షణ పొందుతారు. ఈ కేటగిరి భద్రత ఉన్న వ్యక్తికి ఎంతటి దాడి జరిగినా.. ఎదుర్కొనే శక్తి ఈ జెడ్ ప్లప్ సిబ్బందికి ఉంటుంది. భద్రత కల్పించే విధానాలు ముఖ్యంగా X, Y, Z, Z+, SPG అనే ఐదు రకాలుగా ఉంటుంది. వీఐపీలు, వీవీఐపీలు, క్రీడాకారులు, నటీనటులు, రాజకీయ నేతలు వంటివారికి ఈ విధంగా భద్రత కల్పిస్తారు. అయితే వీరికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కన్న వ్యక్తిగత భద్రతనే ఎక్కువగా ఉంటుంది. అదనంగా వీరికి జెడ్ ప్లస్ కేటగిరి ఉంది.
ఇది కూడా చదవండి: Petrol Price: త్వరలో పెట్రోల్, డీజిల్‌పై రూ.20 వరకు తగ్గనుందా? కేంద్రం ప్రతిపాదన ఏంటి?
అంబానీ భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుంది?
ముఖేష్ అంబానీ భద్రతా వ్యవస్థ చాలా కఠినంగా ఉంటుందనే చెప్పాలి. చీమ కూడా దూరేందుకు అవకాశం లేని విధంగా భద్రత వ్యవస్థ ఉంటుంది. అంబానీ సెక్యూరిటీ వ్యవస్థలో 50 మందికి పైగా సీఆర్‌పీఎఫ్ కమాండోలు ఉంటారు. వీరు 24 గంటలు మోహరించి ఉంటారు. అంతేకాదు.. కమాండోలు అనేక అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉంటారు. వీటిలో జర్మన్ తయారు చేసిన హెక్లర్, కోచ్ MP5 సబ్ మెషిన్ గన్‌లు ఉంటాయని సమాచారం. ఈ తుపాకీ ఒక్క నిమిషంలో 800 రౌండ్లు కాల్చే సామర్థ్యం ఉంటుంది. ముఖేష్ అంబానీకి 6 రౌండ్ ది క్లాక్ ట్రైనింగ్ డ్రైవర్లు కూడా ఉన్నారు.
వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు :
అంబారీకి వీరే కాకుండా దాదాపు 15 నుండి 20 మంది వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులు ఉంటారట. వారి వద్ద ఎలాంటి ఆయుధాలు ఉండవు. ఈ వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులకు ఇజ్రాయెలీ సెక్యూరిటీ కంపెనీ శిక్షణ ఇచ్చింది. ఈ సెక్యూరిటీ గార్డులలో రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ సిబ్బంది కూడా ఉంటారు.
ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఇంట్లో చపాతీలు ఎలా తయారు చేస్తారో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి