Annual Salary: గౌతమ్ అదానీకి రూ.9.26 కోట్ల జీతం..మరి ముఖేష్ అంబానీకి వేతనం ఎంతో తెలుసా?

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, ప్రపంచంలోని 14వ అత్యంత సంపన్న వ్యక్తి అయిన గౌతమ్ అదానీ మొత్తం రూ.9.26 కోట్ల వేతనం పొందుతున్నాడు. అదానీ గ్రూప్‌కు చెందిన 10 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయినప్పటికీ, గౌతమ్ అదానీ కేవలం 2 కంపెనీల నుండి మాత్రమే జీతం తీసుకుంటున్నారట. కంపెనీ ప్రమోటర్‌గా, చైర్మన్‌గా, అనేక ఇతర

Annual Salary: గౌతమ్ అదానీకి రూ.9.26 కోట్ల జీతం..మరి ముఖేష్ అంబానీకి వేతనం ఎంతో తెలుసా?
Gautam Adani Annual Salary
Follow us
Subhash Goud

|

Updated on: Jun 23, 2024 | 2:36 PM

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, ప్రపంచంలోని 14వ అత్యంత సంపన్న వ్యక్తి అయిన గౌతమ్ అదానీ మొత్తం రూ.9.26 కోట్ల వేతనం పొందుతున్నాడు. అదానీ గ్రూప్‌కు చెందిన 10 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయినప్పటికీ, గౌతమ్ అదానీ కేవలం 2 కంపెనీల నుండి మాత్రమే జీతం తీసుకుంటున్నారట. కంపెనీ ప్రమోటర్‌గా, చైర్మన్‌గా, అనేక ఇతర ప్రధాన బాధ్యతలను నిర్వర్తించినందుకు ఆదానీ జీతం తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఈయన జీతం దేశంలోని చాలా మంది బడా వ్యాపారవేత్తల కంటే తక్కువ. అదానీ గ్రూపునకు చెందిన 10 లిస్టెడ్ కంపెనీలు స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం.. గౌతమ్ అదానీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్, SEZ అనే రెండు సంస్థల నుండి మాత్రమే జీతం పొందినట్లు వారి విచారణలో తేలింది.

ఏ కంపెనీ నుండి ఎంత జీతం పొందారు?

పోర్ట్ నుండి గ్రీన్ ఎనర్జీ రంగం వరకు అన్నింటిలో అదానీ గ్రూప్ పనిచేస్తుంది. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ నుండి 2023-24లో రూ. 2.19 కోట్ల వేతనం పొందారు. ఇతర ప్రయోజనాలు, అలవెన్సులుగా రూ.27 లక్షలు పొందారు. ఈ విధంగా ఈ కంపెనీ నుండి అతని మొత్తం వేతనం రూ. 2.46 కోట్లు. AEL వార్షిక నివేదిక ప్రకారం, గౌతమ్ అదానీ జీతం అంచనా 3%. ఇది కాకుండా, గ్రూప్‌లోని రెండవ అతిపెద్ద కంపెనీ అయిన అదానీ పోర్ట్స్, SEZ లిమిటెడ్ (APSEZ) నుండి గౌతమ్ అదానీ 6.8 కోట్ల రూపాయల వేతనాన్ని పొందారు.

ఇది కూడా చదవండి: Airtel 9 Plan: ఎయిర్‌టెల్‌ నుంచి అద్భుతమైన ప్లాన్‌.. కేవలం రూ.9తో అపరిమిత డేటా

ఈ వ్యాపార దిగ్గజాల కంటే అదానీ జీతం తక్కువ:

గౌతమ్ అదానీ జీతం దేశంలోని చాలా మంది పెద్ద వ్యాపార దిగ్గజాల కంటే తక్కువ. దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కోవిడ్-19 తర్వాత కంపెనీ నుండి జీతం తీసుకోవడం మానేశారు. అంతకు ముందు అతని వార్షిక వేతనం రూ.15 కోట్లు. అదే సమయంలో గౌతమ్ అదానీ జీతం టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ యజమాని సునీల్ భారతి మిట్టల్ 2022-23 జీతం రూ. 16.7 కోట్ల కంటే చాలా తక్కువ. గౌతమ్ అదానీ కంటే ఎక్కువ వేతనం పొందుతున్న వారిలో బజాజ్ ఆటో అధినేత రాజీవ్ బజాజ్ వేతనం రూ. 53.7 కోట్లు, హీరో మోటార్స్‌కు చెందిన పవన్ ముంజాల్ రూ. 80 కోట్లు).

8.85 లక్షల కోట్ల ఆస్తికి యజమాని ‘బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్’ ప్రకారం గౌతమ్ అదానీ మొత్తం సంపద 106 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8.85 లక్షల కోట్లు). ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఎదగడానికి అతనికి ముఖేష్ అంబానీకి మధ్య తరచూ పోటీ ఉంటుంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు రాకముందే, సంపద పరంగా ముఖేష్ అంబానీని రెండుసార్లు అధిగమించాడు. ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా కూడా నిలిచాడు.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఇంట్లో చపాతీలు ఎలా తయారు చేస్తారో తెలుసా..?

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత.. అతని గ్రూప్ కంపెనీల షేర్ల విలువ 150 బిలియన్ డాలర్లు తగ్గింది. అయితే ఇప్పుడు అతను కోలుకుని దేశంలో రెండవ అత్యంత ధనవంతుడు అయ్యాడు. 111 బిలియన్ డాలర్ల ఆస్తులతో ముఖేష్ అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. కాగా ఈ జాబితాలో గౌతమ్ అదానీ 14వ స్థానంలో ఉన్నారు.

సోదరులు, మేనల్లుళ్ళు, కొడుకుల జీతం:

గౌతమ్ అదానీ తమ్ముడు రాజేష్ ఏఈఎల్ నుంచి రూ.8.37 కోట్ల జీతం పొందారు. అందులో లాభంపై కమీషన్ రూ.4.71 కోట్లు ఉన్నాయి. కాగా, ఆయన మేనల్లుడు ప్రణబ్ అదానీ కమీషన్ రూ.4.5 కోట్లతో కలిపి మొత్తం రూ.6.46 కోట్ల వేతనం అందుకున్నారు. గౌతమ్ అదానీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ నుండి ఎటువంటి కమీషన్ తీసుకోలేదు. అయితే అతను అదానీ పోర్ట్ నుండి రూ.5 కోట్లు కమీషన్ పొందాడు. ఆయన కుమారుడు కరణ్ అదానీ అదానీ పోర్ట్ ద్వారా రూ.3.9 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. గౌతమ్ అదానీ సోదరుడు, మేనల్లుడు, కొడుకు ఒక కంపెనీ నుండి ఒకటి కంటే ఎక్కువ జీతం తీసుకోరు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి