AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm Wallet: మీరు పేటీఎం వాడుతున్నారా? జూలై 20 నుంచి వాలెట్‌ మూసివేత

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) జీరో బ్యాలెన్స్, ఏడాదికి పైగా లావాదేవీలు లేని వాలెట్లు జూలై 20, 2024న మూసివేయనున్నట్లు ప్రకటించింది. వెబ్‌సైట్ ప్రకారం, ఈ నిష్క్రియ పేటీఎం వాలెట్‌ల వినియోగదారులు మూసివేయడానికి ముందు కమ్యూనికేషన్ 30-రోజుల నోటీసు వ్యవధిని అందుకుంటారు. అయితే సంవత్సరం పాటు ఎలాంటి లావాదేవీలు జరగని జీరో బ్యాలెన్స్‌..

Paytm Wallet: మీరు పేటీఎం వాడుతున్నారా? జూలై 20 నుంచి వాలెట్‌ మూసివేత
Paytm
Subhash Goud
|

Updated on: Jun 25, 2024 | 2:01 PM

Share

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) జీరో బ్యాలెన్స్, ఏడాదికి పైగా లావాదేవీలు లేని వాలెట్లు జూలై 20, 2024న మూసివేయనున్నట్లు ప్రకటించింది. వెబ్‌సైట్ ప్రకారం, ఈ నిష్క్రియ పేటీఎం వాలెట్‌ల వినియోగదారులు మూసివేయడానికి ముందు కమ్యూనికేషన్ 30-రోజుల నోటీసు వ్యవధిని అందుకుంటారు. అయితే సంవత్సరం పాటు ఎలాంటి లావాదేవీలు జరగని జీరో బ్యాలెన్స్‌తో కూడిన వాలెట్లను మూసివేస్తామని పేటీఎం ప్రకటించింది. ఈ విషయమై పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌తన అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 19, 2024న పోస్ట్ చేసింది. మార్చిలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్చి 15, 2024 తర్వాత PPBL కొత్త డిపాజిట్‌లను ఆమోదించరాదని లేదా క్రెడిట్ లావాదేవీలను ఆమోదించకూడదని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Ambani, Adani Security: అంబానీ, ఆదానీల భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుందో తెలిస్తే షాకవుతారు!

మీరు ఇప్పటికే వాలెట్‌లో డబ్బును కలిగి ఉంటే దానిని పరిమితులు లేకుండా ఉపయోగించవచ్చు. ఆ డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. చెల్లింపు చేయవచ్చు. మీరు దానిని పూర్తిగా ఖాళీ చేసే వరకు ఆ వాలెట్ ఉంటుంది. ఇప్పుడు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ గత ఏడాది కాలంగా జీరో బ్యాలెన్స్ ఉన్న వాలెట్లను మాత్రమే మూసివేస్తోంది. పేటీఎం యూజర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాలెట్‌ను మీరే మూసివేయడానికి మీకు అనుమతి ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్చి 15, 2024 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా/వాలెట్ కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా లేదా క్రెడిట్ లావాదేవీలను అనుమతించకుండా నియంత్రిస్తూ ఆదేశాన్ని జారీ చేసింది. పరిమితుల తర్వాత ఈ తేదీ తర్వాత వినియోగదారులు తమ వాలెట్‌లకు డబ్బును డిపాజిట్ చేయలేరు లేదా జోడించలేరు. అయితే, మార్చి 15, 2024 తర్వాత కూడా మీ ప్రస్తుత బ్యాలెన్స్ నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ఎలాంటి పరిమితులు లేవు.

మీ పేటీఎం వ్యాలెట్‌ను మీరే మూసివేయవచ్చు

  • ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేసి Paytm Payments Bank Wallet విభాగానికి వెళ్లండి
  • ‘ఆర్డర్ చేయని సంబంధిత ప్రశ్నలతో సహాయం కావాలి’పై క్లిక్ చేయండి
  • ‘మై వాలెట్‌ని మూసివేయాలనుకుంటున్నాను’ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • మీ వాలెట్ రెండు పని దినాలలో మూసివేయబడుతుంది. అయితే, ఈ ప్రక్రియకు ముందు మీ వాలెట్‌లో డబ్బు ఉంటే, దాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి.
  • మీది కనీస KYC ఉన్న వాలెట్ అయితే, అందులోని డబ్బులు కేవలం వ్యాపారి చెల్లింపుల కోసం మాత్రమే ఉపయోగించుకోవచ్చు. వాలెట్ పూర్తిగా కేవైసీ అప్‌డేట్ అయినట్లయితే, డబ్బును బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Warranty Rules: ఎలక్ట్రినిక్‌ వస్తువులకు కొత్త వారంటీకి రూల్స్ రాబోతున్నాయి.. అవేంటో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!