AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC పనిచేయక రైలులో ఇబ్బందిపడ్డారా? టికెట్ డబ్బులు రీఫండ్ పొందండిలా..

Indian Railways TDR Refund Rules: రైలు ప్రయాణంలో ఏసీ పనిచేయకపోయినా, ట్రైన్ బాగా ఆలస్యంగా నడిచినా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడాల్సి వస్తుంది. అయితే అనివార్య కారణాలతో తమకు తీవ్ర అసౌకర్యం కలిగితే ప్రయాణీకులు తమ టికెట్ డబ్బులు రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. IRCTC నియమాల ప్రకారం TDR ఫైల్ చేసి మీ టికెట్ డబ్బులను సులభంగా రీఫండ్ పొందవచ్చు. అసలు TDR ఏయే సందర్భాల్లో ఫైల్ చేయాలి? ఎలా ఫైల్ చేయాలో తెలుసుకోండి.

AC పనిచేయక రైలులో ఇబ్బందిపడ్డారా? టికెట్ డబ్బులు రీఫండ్ పొందండిలా..
Indian Railways Tdr Refund Rules
Janardhan Veluru
|

Updated on: Jun 06, 2026 | 2:11 PM

Share

రైలు ప్రయాణంలో కొన్నిసార్లు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. రైలు ఆలస్యం కావడం, ఏసీ పనిచేయకపోవడం, కోచ్ మార్చడం లేదా రూట్ మార్పు వంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు అసౌకర్యం కలగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో టికెట్ డబ్బులను రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. TDR (Ticket Deposit Receipt) విధానం ద్వారా టికెట్ డబ్బులు రీఫండ్ పొందే అవకాశముంటుంది. IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో ఈ రీఫండ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది. మీరు చూపిన కారణం సహేతుకమైతే.. టీడీఆర్ ద్వారా కొన్ని సందర్భాల్లో పూర్తి టికెట్ డబ్బులు లేదా పాక్షికంగా టికెట్ డబ్బులు రీఫండ్ పొందేందుకు వీలుంటుంది.

ఏయే కారణాలతో TDR ద్వారా టికెట్ డబ్బు రీఫండ్ పొందవచ్చు?

1. రైలు ఆలస్యం: మీరు ప్రయాణించాల్సిన రైలు 3 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నప్పుడు.. ఆ రైలులో మీరు ప్రయాణించకూడదని నిర్ణయిస్తే టీడీఆర్ ద్వారా టికెట్ రీఫండ్‌కు అప్లై చేసుకోవచ్చు. అయితే రైలు బయలుదేరే సమయానికి ముందే TDR ఫైల్ చేయాల్సి ఉంటుంది.

2. ఏసీ పనిచేయకపోవడం: మీరు AC కోచ్‌లో టికెట్ ఉన్నప్పటికీ ప్రయాణంలో ఏదైనా సాంకేతిక సమస్యల కారణంగా ఏసీ పనిచేయకపోతే మీరు టీడీఆర్ ద్వారా టికెట్ రీఫండ్ కోరచ్చు. మీరు గమ్యస్థానానికి చేరిన 20 గంటల్లోపు TDR ఫైల్ చేయాల్సి ఉంటుంది.

3. దిగువ తరగతిలో ప్రయాణం: బుక్ చేసిన కోచ్ కాకుండా తక్కువ తరగతి బోగీలో ప్రయాణించాల్సి వస్తే టికెట్ రీఫండ్ కోసం 2 రోజుల్లోపు TDR ఫైల్ చేయాలి.

4. రైలు రూట్ మార్పు: ఏదైనా కారణాలతో రైలు రూట్ మారడంతో.. అది మీ స్టేషన్‌కి రాకపోయినా లేదా మీరు రైలు అందుకోలేకపోయినా 72 గంటల్లోపు TDR ఫైల్ చేయాలి.

పైన పేర్కొన్న కారణాలతో రైలు ప్రయాణంలో ఎదురయ్యే అసౌకర్యాలకు సహేతుక కారణాలుంటే సరైన సమయంలో TDR ఫైల్ చేస్తే టికెట్ డబ్బులు రీఫండ్ పొందడం సాధ్యమే.

IRCTCలో TDR ఎలా ఫైల్ చేయాలి?

TDR ఫైల్ చేసేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:

  • RCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో లాగిన్ అవ్వండి.
  • My Account సెక్షన్‌కు వెళ్లండి.
  • అక్కడ My Transactions ను క్లిక్ చేయండి.
  • File TDR ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • మీ PNR నంబర్, ప్రయాణికుడి వివరాలు నమోదు చేయండి.
  • కారణాన్ని ఎంచుకుని సబ్మిట్ చేయండి

టికెట్ రీఫండ్ ఎప్పుడు వస్తుంది?

  • రైలు రద్దు లేదా ఆలస్యం వంటి స్పష్టమైన కారణాలైతే 5–7 రోజుల్లో రీఫండ్ వస్తుంది.
  • ఇతర సమస్యలు (AC ఫెయిల్యూర్ వంటి వాటికి) 30–60 రోజులు వరకు సమయం పట్టే అవకాశముంది.

రైల్వే శాఖ సమగ్ర పరిశీలన తర్వాతే టీడీఆర్ రీఫండ్ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుంది. టీడీఆర్ ఫైల్ చేయడానికి టైమ్‌లిమిట్ చాలా కీలకం. టీడీఆర్ ఫైల్ చేయడం ఆలస్యం అయితే రీఫండ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. టీడీఆర్ ఫైలింగ్ నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోండి)

Follow Us
ఏసీ పనిచేయక రైలు ప్రయాణంలో ఇబ్బందులా? టికెట్ డబ్బులు రీఫండ్ ఇలా..
ఏసీ పనిచేయక రైలు ప్రయాణంలో ఇబ్బందులా? టికెట్ డబ్బులు రీఫండ్ ఇలా..
ఆ హీరో నాకు 14 సినిమాలు ఇప్పించారు.. రాజేంద్ర ప్రసాద్..
ఆ హీరో నాకు 14 సినిమాలు ఇప్పించారు.. రాజేంద్ర ప్రసాద్..
రోజూ 3GB డేటా, 70 రోజుల వ్యాలిడిటీ.. రూ.299 నుంచి ప్రారంభం..!
రోజూ 3GB డేటా, 70 రోజుల వ్యాలిడిటీ.. రూ.299 నుంచి ప్రారంభం..!
సామాన్యుల కోసం సరికొత్త సంస్కరణలు.. ఆర్థిక సలహా మండలితో మోదీ..
సామాన్యుల కోసం సరికొత్త సంస్కరణలు.. ఆర్థిక సలహా మండలితో మోదీ..
తెల్లవారుజామున వచ్చే ఆ కలలు మీ తలరాతను మార్చేస్తాయి..
తెల్లవారుజామున వచ్చే ఆ కలలు మీ తలరాతను మార్చేస్తాయి..
మీ ఏజ్‌ను బట్టి మీరు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా..?
మీ ఏజ్‌ను బట్టి మీరు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా..?
ఇక వీరు రైల్వే టికెట్స్‌ బుక్‌ చేసుకోలేరు.. భారీ షాకిచ్చిన IRCTC
ఇక వీరు రైల్వే టికెట్స్‌ బుక్‌ చేసుకోలేరు.. భారీ షాకిచ్చిన IRCTC
ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు!
ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు!
రామ్ చరణ్ 'పెద్ది'సినిమాకు రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రామ్ చరణ్ 'పెద్ది'సినిమాకు రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కంపెనీ బంపర్ ఆఫర్..సిగరెట్ తాగని ఉద్యోగులకు 6 రోజులు అదనపు సెలవు!
కంపెనీ బంపర్ ఆఫర్..సిగరెట్ తాగని ఉద్యోగులకు 6 రోజులు అదనపు సెలవు!