Gold Rates: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి అదిరిపోయే జాక్‌పాట్.. ఇంతకన్నా మంచి ఛాన్స్ ఉండదు..
బంగారం, వెండి ధరలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. రోజురోజుకి దిగజారుతూ వస్తోన్నాయి. తాజాగా 8 నెలల కనిష్ట స్థాయికి ధరలు తగ్గుముఖం పట్టాయి. డాలర్ బలపడటం, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ త్వరలో వడ్డీ రేట్లను పెంచనుందనే వార్తల క్రమంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి.

బంగారం ధరలు గత కొన్ని వారాలుగా భారీగా పడిపోతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, పరిస్థితుల క్రమంలో కనిష్ట స్థాయికి క్రాష్ అవుతున్నాయి. తాజాగా 8 నెలల కనిష్ట స్థాయికి పసిడి ధరలు డౌన్ అయ్యాయి. దీంతో బంగారం కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ పరిణామంతో బంగారంలో పెట్టుబడి పెట్టినవారు నష్టపోతుండగా.. కొత్తగా కొనుగోలు చేసేవారికి జాక్‌పాట్‌గా చెప్పవచ్చు. అయితే ధరలు గత కొద్ది వారాలుగా తగ్గడం వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి.డాలర్ బలపడటమే ప్రధాన కారణంగా ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు పెరగడంతో బంగారం, వెండిపై ఆకర్షణ తగ్గిందంటున్నారు.
ధరలు తగ్గడానికి కారణమేంటి..?
బంగారం ధరలు పడిపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ పెరగడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాల కారణంగా పెట్టుబడిదారులు బంగారం, వెండి వైపు మళ్లుతున్నారు. బంగారం, వెండి స్టాక్‌లు ఉన్నవారు ధరలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. కొనుగోళ్లు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇవన్నీ ధరలను తగ్గించాయని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇదే పతనం కొనసాగుతుందా.. లేదా పెరుగుతుందా అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో ఎవరూ చెప్పలేం. ప్రస్తుతం కొనసాగుతున్న ధరల పతనం ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.
ప్రస్తుత ధరలు ఇవే..
గురువారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర రూ. 278 మేర తగ్గగా.. ప్రస్తుతం గ్రాము ధర రూ. 14,013గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 2780 మేర తగ్గి రూ.1,40,130కి చేరుకుంది. అటు 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. ఒక గ్రాము ధర రూ. 255 తగ్గి రూ. 12,845కు చేరగా.. 10 గ్రాముల ధర రూ. 2550 తగ్గి ప్రస్తుతం రూ. 1,28,450కి చేరింది.
పడిపోయిన వెండి ధర
బంగారంతో పాటు వెండి ధరలు కూడా కుప్పకూలుతున్నాయి. గురువారం ఒకేసారి పది వేలు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 2,35,000 గా నమోదైంది. అమెరికా-ఇరాన్ యుద్దం మొదలైనప్పటి నుంచి ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. ఇటీవల ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరగడంతో మరింతగా పతనమవుతూ వస్తోన్నాయి. అటు ముడి చమురు ధరలు కూడా క్రాష్ అవుతున్నాయి. బ్యారెల్‌కు 80 డాలర్లకు దిగొచ్చి ఊరట కల్పిస్తున్నాయి.
