AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏ బ్రాండ్ తాగాడో మహానుబావుడు.. పక్షిలా వెళ్లి.. తీగలపై వాలాడు.. ఇదిగో వీడియో

సాధారణంగా కరెంటు వైర్లపై పక్షులు వాలడం చూసుంటారు. కానీ మనుషులు వాలడం ఎప్పుడైనా చూశారా? అదేంటీ మనిషి వాటిని ముట్టుకుంటేనే మసైపోతాడు అంటారు. అది ఒకిత్తకు నిజమే అయినప్పటికీ.. ఇక్కడో మందుబాబును మాత్రం.. ఆ కరెంటు వైర్లు కూడా ఏం చేయలేకపోయాయి. ఫుల్‌గా మందుకొట్టిన అతను ఎంచక్క స్తంభంమెక్కి.. ఆ కరెంటె వైర్లపై దర్జాగా పడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఏ బ్రాండ్ తాగాడో మహానుబావుడు.. పక్షిలా వెళ్లి.. తీగలపై వాలాడు.. ఇదిగో వీడియో
Viral Drunk Man Climbs High Voltage Electric Pole
Anand T
|

Updated on: Jun 25, 2026 | 12:17 PM

Share

చుక్క పడితే చాలు.. మనల్నెవర్రా అపేది అనేలా ప్రవర్తిస్తారు మందుబాబులు.. ఇక్కడో వ్యక్తి కూడా అదే పని చేశాడు. ఫుల్‌గా తాగి నేరుగా గ్రామంలో ఉన్న స్తంభంపైకి ఎక్కాడు.. ఆ మత్తులోనే ఆ స్తంభానికి ఉన్న 11 KV హై-వోల్టేజ్ విద్యుత్ వైర్లపై పక్షిలా వాడిపోయాడు. ఇంట్లో మంచంపై పడుకున్నట్టు ఆ వైర్లపై పడుకున్నాడు. స్థానికుల సమాచారంతో విద్యుత్‌ శాఖ అధికారులు కరెంటు ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. భితౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్సా ఖుర్ద్ గ్రామానికి చెందిన దీన్ దయాళ్ అనే వ్యక్తి ఫుల్‌గా మద్యం తాగాడు. ఆ మత్తులో ఊగుతూ ఊరి చివర ఉన్న హై-వోల్టేజ్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కాడు. అంతటితో ఆగకుండా పైభాగంలో ఉన్న ప్రమాదకరమైన విద్యుత్ తీగలపై పడుకున్నాడు. అది గమనించిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయం క్షణాల్లోనే ఊరంతా వ్యాపించడంతో జనాలు మొత్తం అక్కడికి చేరుకున్న చేరుకున్నారు. వెంటనే అతన్ని కిందకు దిగాలని కేకలు వేశారు. కానీ మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వారి ఎవరి మాటలను పట్టించుకోలేదు.

ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే వరకు సదరు లైన్‌కు విద్యుత్ సరఫరా పునరుద్ధరించవద్దని విద్యుత్ శాఖ అధికారులను అలర్ట్ చేశారు. సుమారు రెండు, గంటల పాటు పోలీసులు, విద్యుత్ సిబ్బంది, గ్రామస్తులు కలిసి దీన్ దయాళ్‌తో మాట్లాడి, నచ్చజెప్పి కిందికి దిగాలని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు వారి శ్రమ ఫలించి, అతను సురక్షితంగా కిందకు దిగడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

కాపాడిన అదృష్టం..

అయితే అతను స్తంభం ఎక్కి కరెంటె షాక్ ఎందుకు కొట్టలేదని ఇక్కడ చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. కానీ ఇక్కడే దీన్ దయాళ్‌ను అదృష్టం వరించింది. సరిగ్గా అతను స్తంభం ఎక్కడానికి కొన్ని నిమిషాల ముందే ఆ లైన్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒకవేళ ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండి ఉంటే, హై-వోల్టేజ్ కారణంగా కాలి బూడిదైపోయేవాడని స్థానికులు చెబుతున్నారు. అతని అదృష్టమే అతన్ని కాపాడిందని అందరూ అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానినుకుల సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయండంలో ఇది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us