Market News: స్వ ల్ప ఊగిసలాటల్లో మార్కెట్లు.. బలాన్ని నింపిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
Market News: ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప ఊగిసలా మధ్య ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్(Banking Sector), ఆటో, మెటల్ స్టాక్స్ ఒత్తిడిలో ఉండగా.. పవర్, ఐటీ స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Market News: ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప ఊగిసలా మధ్య ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్(Banking Sector), ఆటో, మెటల్ స్టాక్స్ ఒత్తిడిలో ఉండగా.. పవర్, ఐటీ స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత రెండు వారాలుగా రష్యా-ఉక్రెయిన్(Russia Ukraine Crisis) యుద్ధం మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. యుద్ధ ప్రభావంతో చమురు ధరలు కూడా అమాంతం 2008 నాటి ధరలకంటే పెరిగిపోతున్నాయి. ఇది కూడా మార్కెట్లను కిందకు లాగుతోంది. రష్యా చమురు సరఫరాపై ఆంక్షలు విధిస్తే ముడి చమురు ధర.. ఏకంగా బ్యారెల్ కు 200 డాలర్లను క్రాస్ చేసి, 300 దిశగా వెళ్లినా ఆశ్చర్యం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిన్న వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా మార్కెట్ పై కొంత ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఐదు రాష్ట్రాల్లో మూడు నుంచి నాలుగు రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీ తిరిగి అధికారంలోకి రానుందని తెలుస్తోంది. ముఖ్యంగా యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా చూసిన ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ మళ్లీ ముఖ్యమంత్రి కానున్నారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును కాస్త బలపరిచింది. అయితే.. ప్రతికూల పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ, ఆసియా మార్కెట్‌లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ ఎన్నికల ప్రభావం సానుకూలంగా, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ప్రతికూలంగా ఉండటంతో దేశీయ మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్నాయి.
ఉదయం బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 52,430 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,024 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని, 52,410 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. మరో సూచీ నిఫ్టీ 15,747 పాయింట్ల వద్ద ప్రారంభమై,15,896 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని, 15,747 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.11 సమయానికి 95 పాయింట్లు నష్టపోయి 52,747 పాయింట్ల వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 15,822 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
ఇవీ చదవండి..
Navi IPO: మెగా ఐపీఓతో ముందుకొస్తున్న నావీ.. 97 శాతం వాటా కలిగి ఉన్న ఫిప్ కార్ట్ సహవ్యవస్థాపకుడు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. 11 ఏళ్ల బాలుడు 1000 కి.మీలు ఒంటరిగా ప్రయాణించాడు..!