Gram Suraksha Yojana: నెలకు రూ. 1,500 పెట్టుబడి పెట్టండి.. మెచ్యూరిటీపై రూ. 35 లక్షలు పొందండి..
పొదుపు పథకాలు అంటే మనకు గుర్తుకు వచ్చేది పోస్ట్ ఆఫీస్. తక్కువ రిస్క్‌తో కూడిన పథకాలు పోస్టాఫీస్ (India Post)లో ఉన్నాయి. ఇలా ఎన్నో మనకు అందుబాటులోకి..
Post Office Scheme: పొదుపు పథకాలు అంటే మనకు గుర్తుకు వచ్చేది పోస్ట్ ఆఫీస్. తక్కువ రిస్క్‌తో కూడిన పథకాలు పోస్టాఫీస్ (India Post)లో ఉన్నాయి. ఇలా ఎన్నో మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో గ్రామీణ ప్రజల కోసం ఉద్దేశించిన కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు తన గ్రామీణ కార్యక్రమంలో భాగంగా గ్రామ సురక్ష యోజన (Gram Suraksha Yojana) లేదా గ్రామ సురక్ష పథకాన్ని రూపొందించింది. దీని కింద నెలకు రూ.1,500 డిపాజిట్ చేసే పెట్టుబడిదారుడు రూ.35 లక్షల వరకు రిటర్న్ పొందవచ్చు. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం. గ్రామ సురక్ష యోజన 19 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది. ఈ పథకానికి గరిష్ట అర్హత పరిమితి 55 సంవత్సరాలు.
గ్రామ సురక్ష యోజన కనీస విలువ రూ. 10,000 హామీని అందజేస్తుండగా.. పెట్టుబడి పెట్టేవారు రూ. 10 లక్షల వరకు ఏ మొత్తాన్ని అయినా ఎంచుకోవచ్చు. ఇలా ఎవరైనా వ్యక్తి 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వచ్చినప్పుడు వారి చట్టపరమైన వారసుడు/నామినీకి మరణం సంభవించినప్పుడు. ఏది ముందుగా సంభవించినా బోనస్‌తో కూడిన మొత్తం చెల్లించబడుతుంది.
పెట్టుబడిదారుడు ప్రీమియంను నెలవారీగా కానీ త్రైమాసిక(మూడు నెలలు), అర్ధ-వార్షిక (ఆరు నెలలు) లేదా వార్షిక (EMI) ప్రాతిపదికన చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లించడానికి కస్టమర్‌కు 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుంది. పాలసీ వ్యవధిలో డిఫాల్ట్ అయిన సందర్భంలో, చందాదారుడు బకాయి ఉన్న ప్రీమియం చెల్లించడం ద్వారా బీమాను పునరుద్ధరించవచ్చు.
పెట్టుబడి.. మెచ్యూరిటీ..
ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయస్సులో గ్రామ సురక్ష పాలసీలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, నెలవారీ ప్రీమియం 55 సంవత్సరాలకు రూ.1,515, 58 సంవత్సరాలకు రూ.1,463, 60 సంవత్సరాలకు రూ.1,411. 55 ఏళ్ల బీమా కోసం మెచ్యూరిటీ ప్రయోజనం రూ. 31.60 లక్షలు కాగా, 58 ఏళ్ల పాలసీకి రూ. 33.40 లక్షలు. 60 ఏళ్ల మెచ్యూరిటీ ప్రయోజనం రూ.34.60 లక్షలు.
కస్టమర్ మూడు సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేయడానికి కూడా ఎంచుకోవచ్చు, అయితే, ఆ సందర్భంలో, మీరు ఎలాంటి గ్రామ సురక్ష యోజన ప్రయోజనాలకు అర్హులు కారు.
ఇవి కూడా చదవండి: Budget 2022: సామాన్యుల జీవన చక్రం.. పరుగుల బండిపై నిర్మలమ్మ నజర్.. రైల్వేపై ఎలా..
Black Diamond: దుబాయ్‌లో అతి పెద్ద నల్ల వజ్రం ఆవిష్కారం.. ఈ బ్లాక్ డైమండ్ చాలా స్పెషాల్..