AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య చారిత్రాత్మక ఒప్పందం! మన దేశంలోని రైతులకు ఎంతో మేలు..!

భారత్, ఇజ్రాయెల్ మధ్య సుదీర్ఘంగా ఎదురుచూసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) నిబంధనలు ఖరారయ్యాయి. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ సమక్షంలో ఈ చారిత్రక ఒప్పందం కుదిరింది. 14 ఏళ్ల చర్చల అనంతరం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇది కొత్త ఊపునిస్తుంది.

భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య చారిత్రాత్మక ఒప్పందం! మన దేశంలోని రైతులకు ఎంతో మేలు..!
India Israel Fta
SN Pasha
|

Updated on: Nov 21, 2025 | 6:15 AM

Share

భారత్‌, ఇజ్రాయెల్ మధ్య దీర్ఘకాల స్నేహం ఇప్పుడు కొత్త వాణిజ్య అధ్యాయంలోకి ప్రవేశించింది. భారత్‌, ఇజ్రాయెల్ సంబంధాలలో ఒక చారిత్రాత్మక సంఘటన గురువారం టెల్ అవీవ్‌లో జరిగింది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) నిబంధనలు ఖరారు అయ్యాయి. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, నిర్ బర్కత్‌తో కలిసి ఒప్పందం నిబంధనలపై సంతకం చేశారు.

వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ప్రస్తుతం 60 మంది సభ్యుల భారత వ్యాపార ప్రతినిధి బృందంతో ఇజ్రాయెల్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) పురోగతిని సమీక్షించడం ఈ పర్యటన ప్రధాన ఎజెండా. ఇప్పుడు రెండు దేశాల మంత్రులు ఒప్పందం నిబంధనలను ఖరారు చేసి అధికారికంగా సంతకం చేశారు. పియూష్ గోయల్, ఇజ్రాయెల్ పరిశ్రమ మంత్రి నిర్ బర్కత్ కూడా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణలను పెంపొందించడానికి కొత్త మార్గాలను చర్చించారు. ఈ ఒప్పందం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది.

14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ

భారత్‌, ఇజ్రాయెల్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ఈ రోజే కాదు, మే 2010 నుండి కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య ఇప్పటివరకు ఎనిమిది రౌండ్ల చర్చలు జరిగాయి. మధ్యలో కొంత గ్యాప్‌ వచ్చింది. కానీ అక్టోబర్ 2021లో ఇరుపక్షాలు చర్చల పట్టికకు తిరిగి రావడానికి అంగీకరించాయి. వాణిజ్య గణాంకాలు స్వల్పంగా తగ్గిన సమయంలో ఈ ఒప్పందం కుదిరింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇజ్రాయెల్‌కు భారత ఎగుమతులు గత సంవత్సరం 4.52 బిలియన్ డాలర్ల నుండి 2.14 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. దిగుమతులు కూడా తగ్గాయి. అందువల్ల FTA నిబంధనల ఆమోదం రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పునరుద్ధరించడానికి బూస్టర్ డోస్‌గా ఉపయోగపడుతుంది.

ఏం మారుతుంది?

భారత్‌ ఆసియాలో ఇజ్రాయెల్‌కు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ప్రధానంగా వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలపై దృష్టి పెట్టింది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా లావాదేవీలు ఎలక్ట్రానిక్ యంత్రాలు, హై-టెక్ ఉత్పత్తులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వైద్య పరికరాలు వంటి ఆధునిక రంగాలలోకి విస్తరించాయి. భారత్‌ గణనీయమైన మొత్తంలో ముత్యాలు, విలువైన రాళ్ళు, ఆటోమోటివ్ డీజిల్, యంత్రాలు, వస్త్రాలు, దుస్తులు, వ్యవసాయ ఉత్పత్తులను ఇజ్రాయెల్‌కు ఎగుమతి చేస్తుంది. ఈ ఒప్పందం ఈ భారతీయ ఉత్పత్తులను ఇజ్రాయెల్ మార్కెట్‌కు అందుబాటులోకి తీసుకురావడానికి మరింత దోహదపడుతుందని, భారతీయ తయారీదారులు, రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us