AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: మీ ఇంట్లో బంగారం దాచుకుంటున్నారా..? ఈ పని చేయకపోతే మీకు భారీగా నష్టం..

మీ ఇంట్లో బంగారం ఎక్కువగా దాచుకుంటున్నారా.. అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. మీ బంగారం చోరీకి గురైతే భారీగా ఆర్ధిక నష్టం జరుగుతుంది. బంగారం ధరలు భారీగా పెరగడంతో అది విలువైన ఆస్తిగా మారింది. దీంతో ఇలాంటి సమయంలో మీరు నష్టపోకుండా ఉండాలంటే..

Gold: మీ ఇంట్లో బంగారం దాచుకుంటున్నారా..? ఈ పని చేయకపోతే మీకు భారీగా నష్టం..
gold
Venkatrao Lella
|

Updated on: Jun 05, 2026 | 9:07 PM

Share

ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఇది అత్యంత విలువైన ఆస్తిగా మారిపోయింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముంటుంది. ఈ క్రమంలో బంగారం చోరీ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో బీరువాల్లో పెట్టుకుంటే దొంగలు కొల్లగొట్టే అవకాశముంటుంది. ఇక బ్యాంకు లాకర్లలో పెట్టడం కూడా సురక్షితం కాదని చాలామంది భావిస్తుంటారు. ఇలాంటి క్రమంలో మీ బంగారం సురక్షితంగా ఉండాలంటే ఏకైక మార్గం ఒక్కటే.. అదే మీ దగ్గర ఉండే గోల్డ్‌కు ఇన్యూరెన్స్ చేయించుకోవడం. ఇటీవల మార్కెట్లో గోల్డ్ ఇన్యూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది. కంపెనీలు పోటీ పడి ఈ ఇన్యూరెన్లను ఆఫర్ చేస్తున్నాయి.

ఇన్యూరెన్స్ అవసరమా..?

ఒకప్పుడు గోల్డ్ ఇన్యూరెన్సులు ఎక్కువగా వ్యాపారులు చేయించుకునేవారు. గోల్డ్ షాపుల యజమానులు ఇన్యూరెన్స్ తీసుకునేవారు. ఎందుకంటే షాపులోని బంగారం చోరీకి గురైతే భారీగా ఆర్ధిక నష్టం చేకూరుతుంది. దీంతో గోల్డ్‌కు బీమా చేయించుకునేవారు. అలాగే షాపులకు గోల్డ్ సరఫరా చేసేవారు కూడా ఇన్యూరెన్స్ చేయించుకునేవారు. కానీ ఇప్పుడు బంగారం ధరలు పెరగడంతో సామాన్యుల కూడా తమ వద్ద ఉండే బంగారానికి ఇన్యూరెన్స్ చేయించుకోవాల్సి వస్తోంది. రోడ్లపైకి బంగారం ధరించి వెళ్లినప్పుడు దొంగల కన్ను పడే అవకావం ఉంటుంది. ఇటీవల ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. ఇక ఇళ్లల్లో కూడా గోల్డ్ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో వీటికి ఇన్యూరెన్స్ చేయించుకోవడం తప్పనిసరిగా మారిందని నిపుణులు చెబుతున్నారు.

కవరేజీ వేటికి వరిస్తుంది..?

బంగారానికి రెండు విధాలుగా ఇన్యూరెన్స్ చేయించుకోవచ్చు. అందులో ఒకటి హోమ్ ఇన్యూరెన్స్. ఈ ఇన్యూరెన్స్ కింద ఇంట్లోని వస్తువులకు ఎలా బీమా కవర్ అవుతుందో.. అలాగే బంగారానికి కూడా బీమా కవరేజీ తీసుకోవాలి. ఈ ఇన్యూరెన్స్‌లో ఒక నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే కవరేజీ ఉంటుంది. బీమా కవరేజీలో 20 శాతం వరకు మాత్రమే నగుదు అందుతుంది. ఇక రెండో విధానం స్టాండ్ అలోన్ పాలసీ. మీరు కొనుగోలు చేసిన బంగారం మొత్తంపై ఈ బీమా తీసుకోవచ్చు. నగదు దొంగతనం జరిగినా కవరేజీ అనేది లభిస్తుంది. ఇక భకంపాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగినప్పుడు కూడా బీమా కవరేజీ లభిస్తుంది. అయితే బంగారం కొనుగోలు చేసినప్పుడు ఇన్వాయిస్ తీసుకోండి. జీఎస్టీ చెల్లిస్తేనే ఇన్యూరెన్స్ అందిస్తామని కొన్ని పాలసీ కంపెనీలు రూల్స్ విధిస్తున్నాయి. దీంతో పాలసీ తీసుకునేట్పుడు వేటి వేటికి వర్తిస్తుందనేది ఒకసారి చెక్ చేస్కోండి. సరైన పాలసీ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం.

Follow Us