AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ ట్విస్ట్.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్! ఏం జరిగిందంటే..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో హాస్పిటల్‌లో డిశ్చార్జ్ అయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిన ఉదయ్ కృష్ణారెడ్డిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉదయ్‌ కృష్ణా రెడ్డి అరెస్ట్‌ కావడం చర్చణీయాంశంగా మారింది. లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఎక్కడ? హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ తర్వాత ఎక్కడకు వెళ్లాడు? పోలీసుల కళ్లు గప్పి ఎక్కడున్నాడు? ఉదయ్ కృష్ణారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బిగ్ ట్విస్ట్.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్! ఏం జరిగిందంటే..
Trainee IPS Uday Krishna Reddy
Srilakshmi C
|

Updated on: Jul 28, 2026 | 6:34 PM

Share

హైదరాబాద్‌, జులై 28: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఉదయ్‌ కృష్ణారెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. దీంతో మరోసారి ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఉదయ్‌ కృష్ణారెడ్డి అరెస్ట్‌ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో జరగనున్న విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.

హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ తర్వాత అదృశ్యం

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. ఆ తర్వాత ఆయన అందుబాటులో లేకుండా పోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయ్‌ కృష్ణారెడ్డిని త్వరలో అరెస్ట్‌ చేస్తామని హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. ఆయన కోసం హైదరాబాద్‌తో పాటు ఒంగోలు ప్రాంతాల్లో కూడా పోలీసులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించారు. పోలీసుల గాలింపు చర్యల అనంతరం మంగళవారం జులై 28న మిర్యాలగూడలో ఉదయ్‌ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (NPA)లో శిక్షణ పొందుతున్న ఓ లేడీ ట్రైనీ ఐపీఎస్‌ అధికారిని ఉదయ్‌ కృష్ణారెడ్డి వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై కేసు నమోదు కాగా, దర్యాప్తు కొనసాగుతోంది.

తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్‌ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ జరగనున్న సమయంలోనే అరెస్ట్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసులు కేసుకు సంబంధించిన తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో కోర్టు నిర్ణయం, దర్యాప్తు పురోగతిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

Follow Us
హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
జీతంలో బేసిక్, గ్రాస్, నెట్ సాలరీ అంటే ఏమిటి?
జీతంలో బేసిక్, గ్రాస్, నెట్ సాలరీ అంటే ఏమిటి?
భారత్ ఖాతాలో మరో క్లీన్ స్వీప్ విక్టరీ లోడింగ్.. కట్‌చేస్తే..
భారత్ ఖాతాలో మరో క్లీన్ స్వీప్ విక్టరీ లోడింగ్.. కట్‌చేస్తే..
అద్భుతం.. 9 రోజుల్లో తయారైన AI రాడార్‌కు 3.17 లక్షల డాలర్ల డీల్!
అద్భుతం.. 9 రోజుల్లో తయారైన AI రాడార్‌కు 3.17 లక్షల డాలర్ల డీల్!
బిగ్ ట్విస్ట్.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్!
బిగ్ ట్విస్ట్.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్!
ప్రాణం మీదకు తెచ్చిన నోటి దురుసు... అలా అంటేనే కొట్టి చంపేస్తారా
ప్రాణం మీదకు తెచ్చిన నోటి దురుసు... అలా అంటేనే కొట్టి చంపేస్తారా
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి సత్యదేవ్ రీసెంట్ సినిమా
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి సత్యదేవ్ రీసెంట్ సినిమా
కన్వర్ యాత్ర ప్రత్యేకత ఇదే..! ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుంది?
కన్వర్ యాత్ర ప్రత్యేకత ఇదే..! ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుంది?
మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు
మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..