AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీతంలో బేసిక్, గ్రాస్, నెట్ సాలరీ అంటే ఏమిటి? ఉద్యోగులందరూ మస్ట్‌గా తెలుసుకోవాలి

Basic vs Gross vs Net Salary: ప్రతి నెల జీతం వస్తున్నా బేసిక్ సాలరీ, గ్రాస్ సాలరీ, నెట్ (ఇన్-హ్యాండ్) సాలరీ మధ్య తేడా చాలామందికి తెలియదు. జీతం ఎలా లెక్కిస్తారు? ఏ మొత్తంపై పన్నులు, PF కోతలు ఉంటాయి? చివరకు చేతికి ఎంత వస్తుంది? వంటి సందేహాలకు ఈ కథనం స్పష్టమైన సమాధానం ఇస్తుంది. ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన జీతం నిర్మాణాన్ని సులభంగా అర్థమయ్యేలా ఇక్కడ వివరించడం జరిగింది.

జీతంలో బేసిక్, గ్రాస్, నెట్ సాలరీ అంటే ఏమిటి? ఉద్యోగులందరూ మస్ట్‌గా తెలుసుకోవాలి
Basic Salary Vs Gross Salary And Net Salary
Janardhan Veluru
|

Updated on: Jul 28, 2026 | 6:29 PM

Share

ఉద్యోగంలో చేరిన తర్వాత చాలామంది ఉద్యోగులకు ప్రతి నెలా జీతం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అయితే చాలా మందికి బేసిక్ సాలరీ (Basic Salary), గ్రాస్ సాలరీ (Gross Salary), నెట్ లేదా ఇన్-హ్యాండ్ సాలరీ (Net/In-hand Salary) మధ్య ఉన్న తేడా గురించి పూర్తిగా అవగాహన ఉండదు. అయితే ప్రతి ఉద్యోగి ఈ మూడు పదాల అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా జీతం నిర్మాణం, పన్నులు, భవిష్యత్ పొదుపులు, ఉద్యోగ ప్రయోజనాలపై సరైన అవగాహన ఏర్పడుతుంది.

బేసిక్ సాలరీ అంటే ఏమిటి?

బేసిక్ సాలరీ అనేది ఉద్యోగికి ఇచ్చే ప్రాథమిక వేతనం. సాధారణంగా ఇది మొత్తం జీతంలో ప్రధాన భాగంగా ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ప్రావిడెంట్ ఫండ్ (PF), గ్రాచ్యుటీ వంటి అనేక ప్రయోజనాలు ఈ బేసిక్ సాలరీ ఆధారంగానే లెక్కిస్తారు.

గ్రాస్ సాలరీ అంటే?

బేసిక్ సాలరీతో పాటు HRA, ప్రత్యేక అలవెన్సులు, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ లేదా ఇతర భత్యాలను కలిపి వచ్చే మొత్తాన్ని గ్రాస్ సాలరీ అంటారు. అయితే ఇందులో PF, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఆదాయపు పన్ను వంటి కోతలు తీసివేయరు.

ఇవి కూడా చదవండి

నెట్ లేదా ఇన్-హ్యాండ్ సాలరీ అంటే?

గ్రాస్ సాలరీ నుంచి ఉద్యోగి PF, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఆదాయపు పన్ను (TDS) తదితర తప్పనిసరి కోతలను మినహాయించిన తర్వాత ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే మొత్తమే నెట్ లేదా ఇన్-హ్యాండ్ సాలరీ.

ఎందుకు ఈ తేడా తెలుసుకోవాలి?

ఉద్యోగం మారేటప్పుడు లేదా కొత్త ఆఫర్‌ను అంగీకరించే ముందు కేవలం CTC లేదా గ్రాస్ సాలరీనే కాకుండా, వాస్తవంగా చేతికి వచ్చే నెట్ సాలరీ ఎంత అనే విషయాన్ని కూడా పరిశీలించాలి. సాలరీ స్ట్రక్షర్ ఒక్కో కంపెనీలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే ఈ విషయంలో సరైన అవగాహన లేకపోతే తప్పులో కాలేసే అవకాశముంటుంది. అలాగే PF, పన్నులు, ఇతర ప్రయోజనాలు ఎలా లెక్కిస్తారో తెలుసుకోవడం వల్ల మీ ఆర్థిక ప్రణాళికను మెరుగ్గా రూపొందించుకోవచ్చు. ఈ కారణంగా బేసిక్, గ్రాస్, నెట్ సాలరీల మధ్య ఉన్న తేడాను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా అర్థం చేసుకోవడం అవసరం.

Also Read: ప్రతి నెలా టైమ్‌కి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా.. CIBIL Score తగ్గుతుందా?

Follow Us
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర
అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర
డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?
డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర