OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి ‘రావు బహదూర్’..సత్యదేవ్ యాక్టింగ్ కోసమైనా చూడాల్సిందే
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘రావు బహదూర్’. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకటేష్ మహా దర్శకత్వం వహించాడు. మలయాళ నటి దీపా థామస్ హీరోయిన్ గా నటించింది. జులై 03న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.

తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావించి సత్యదేవ్ ఎంతో కష్టపడి నటించిన చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఎన్నో గెటప్పులు వేశాడు సత్యదేవ్. అలాగే లుక్స్, వేరియషన్స్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే రిలీజ్ కు ముందే ఈ మూవీపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు ఈ సినిమాను మహేష్ బాబు ప్రొడ్యూస్ చేయడంతో ‘రావు బహదూర్’ పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే జులై 03న పెద్ద ఎత్తున ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. కానీ మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. నిజం చెప్పాలంటే సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా చాలా మంది ఆడియెన్స్ కు కనెక్ట్ కాలేదు. కథ కథనాలు డిఫరెంట్ గా ఆకట్టకునేలా ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం మరీ నాసిరకంగా ఉందని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం అద్దిరిపోయిందని ప్రశంసలు వచ్చాయి. సినిమాలో అతని నటనకు నేషనల్ అవార్డు ఇచ్చినా తక్కువే అని సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖులు మెచ్చుకున్నారు.
థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ‘రావు బహదూర్’ నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జులై 31 నుంచి సత్యదేవ్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ బాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
రావు బహదూర్ సినిమా విషయానికి వస్తే.. జి.ఎమ్.బి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పణలో, A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళ నటి దీపా థామస్ హీరోయిన్ గా నటించింది. వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్, ప్రణయ్ వాకా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
మరో మూడు రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లో సత్యదేవ్ రావ్ బహదూర్..
Samajika nibandhanalatho mee burrani kadagadaniki Rao Bahadur osthunnadu! 😎👑 pic.twitter.com/A97zYKYU8i
— Netflix India South (@Netflix_INSouth) July 28, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




