Gold Prices: బంగారం ధరలను ఎవరు ఫిక్స్ చేస్తారు..? ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే..
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దీంతో ధరలను ఎవరు నిర్ణయిస్తారు అనే అనుమానం అందరిలోనే ఉంటుంది. అంతర్జాతీయంగా ధరలు మారితే దేశంలోనూ ధరలు మారుతూ ఉంటాయి. అయితే ఇండియాలో బంగారం ధరలను ఎవరు ఫిక్స్ చేస్తారు..? ప్రభుత్వమా? లేదా వ్యాపారులా? అనేది చూద్దాం.

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.1.60 లక్షల వద్ద ఉంది. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు రోజు ఒకేలా ఉండవు. ప్రతీ రోజు మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ పరిణామాలు, యుద్దాలు, ద్రవ్యోల్బణం, ఆర్ధిక అనిశ్చితి, ఉద్రిక్తతలను బట్టి గోల్డ్ ధరలు ఛేంజ్ అవుతూ ఉంటాయి. ఇక డిమాండ్, కొనుగోళ్లు, పెట్టుబడుల ప్రభావం వల్ల కూడా ధరల్లో సవరణలు జరుగుతూ ఉంటాయి. అయితే బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు? అనే డౌట్ ప్రతీఒక్కరికీ ఉంటుంది. ప్రభుత్వాలు నిర్ణయిస్తాయా..? లేదా ఏదైనా సంస్థ ఫిక్స్ చేస్తుందా? అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. దీనికి సమాధానం ఇప్పుడు చూద్దాం.
ధరలను ఎవరు ఫిక్స్ చేస్తారంటే..?
భారత్ విషయానికొస్తే.. బంగారం ధరలను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్’ ఫిక్స్ చేస్తూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లు, రూపాయి విలువ, దేశంలో బంగారం డిమాండ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, సరఫరా ఆధారంగా ఆ సంస్థ ధరలను ఫిక్స్ చేస్తుంది. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ధరలను విడుదల చేస్తూ ఉంటుంది. దీంతో ప్రభుత్వంతో లేదా వ్యాపారులతో సంబంధం ఉండదు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చేతుల్లోనే ధరలను నిర్ణయించే అధికారం అనేది ఉంటుంది. ఈ అసోసియేషన్‌లో బంగారం దిగుమతి చేసుకునేువారితో పాటు పెద్ద బ్యాంకులు, బడా గోల్డ్ వ్యాపారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అంతర్జాతీయ పరిస్థితులు, దేశంలోని పరిణామాలను బట్టి ధరలను నిర్ణయిస్తారు.
బంగారం ధరల్లో మార్పు
ఈ సంస్థ ఉదయం, సాయంత్రం ధరలను విడుదల చేస్తుంది. ఇక భారత్ విదేశాల నుంచి ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీంతో బంగారం కొనుగోలు చేసే సమయంలో డాలర్లలో చెల్లిస్తాం. రూపాయి విలువ తగ్గినప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీని వల్ల రూపాయి విలువలో మార్పుల వల్ల బంగారం ధరలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక పండుగ సీజన్ సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ సరఫరా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కూడా ధరలు పెరుగుతాయి. ఇక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్సులు, జీఎస్టీ రేట్ల ఆధారంగా కూడా ధరలు మారుతూ ఉంటాయి. రాష్ట్రాలు బంగారంపై ప్రత్యేకంగా టాక్సులు విధిస్తారు. దీంతో ఒక్కొ రాష్ట్రంలో ఒక్కొలా ధరలు అనేవి ఉంటాయి. ఇక రవాణా ఖర్చులను బట్టి ప్రాంతాల వారీగా కూడా ధరల్లో మార్పులు అనేవి ఉంటాయి.
