Bajaj Freedom 125 vs Hero Xtreme-125: ఆకట్టుకుంటున్న బజాజ్ సీఎన్‌జీ బైక్.. ఆ హీరో బైక్‌తో గట్టిపోటీ

ప్రముఖ బైక్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో ఇటీవల భారతీయ ఎంట్రీ-లెవల్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో సీఎన్‌జీ మోటార్ సైకిల్ ఫ్రీడమ్ 125 లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌లో ఈ మోటర్ సైకిల్ టాప్ కంపెనీ బైక్స్ గట్టిపోటీనిస్తుంది. ముఖ్యంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్‌కు పోటీగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధర, స్పెసిఫికేషన్లల్లో ఈ రెండు స్కూటర్లు పోటీపడుతున్నాయని వివరిస్తున్నారు.

Bajaj Freedom 125 vs Hero Xtreme-125: ఆకట్టుకుంటున్న బజాజ్ సీఎన్‌జీ బైక్.. ఆ హీరో బైక్‌తో గట్టిపోటీ
Bajaj Freedom 125 Vs Hero Xtreme 125
Follow us

|

Updated on: Jul 18, 2024 | 7:46 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ వాహనాలకు పోటీగా సీఎన్‌జీ వాహనాలకు ఆటోమొబైల్ కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. అయితే సీఎన్‌జీ వాహనాలు కేవలం కార్లకే పరమితమయ్యాయి. కానీ ప్రముఖ బైక్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో ఇటీవల భారతీయ ఎంట్రీ-లెవల్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో సీఎన్‌జీ మోటార్ సైకిల్ ఫ్రీడమ్ 125 లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌లో ఈ మోటర్ సైకిల్ టాప్ కంపెనీ బైక్స్ గట్టిపోటీనిస్తుంది. ముఖ్యంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్‌కు పోటీగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధర, స్పెసిఫికేషన్లల్లో ఈ రెండు స్కూటర్లు పోటీపడుతున్నాయని వివరిస్తున్నారు.  అయితే ఫ్రీడమ్ 125 బైక్‌పై మాత్రం పెట్రోల్, సీఎన్‌జీ రెండింటితో దూసుకుపోవచ్చు. ఈ నేపథ్యంలో బజాజ్ ఫ్రీడమ్ 125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్ బైక్స్ మధ్య ప్రధాన తేడాలను ఓ సారి తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా మోటార్ సైకిల్ విభాగంలో సీఎన్‌జీ, పెట్రోల్ వెర్షన్‌లో నడిచే మొట్టమొదటి మోటర్ సైకిల్‌గా బజాజ్ ఫ్రీడమ్ 125 నిలిచింది. అయితే హీరో ఎక్స్‌ట్రీమ్ కేవలం పెట్రోల్ ఆధారంగా పని చేస్తుంది. అలాగే ఈ బైక్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ గేర్బాక్స్ ఆధారంగా పని చేస్తుంది. 9.5 హెచ్‌పీ, 9.7 ఎన్ఎం గరిష్ట టార్క్‌ ఆధారంగా నడుస్తుంది. ఇంధన సామర్థ్యం పరంగా ఈ మోటార్ సైకిల్ లీటరు పెట్రోల్ 66 కి.మీల మైలేజ్ ఇస్తుంది. అయితే ఫ్రీడమ్ 125 330 కిమీల పరిధితో వస్తుంది. ప్రతి కేజీ సీఎన్జికీ 102 కిమీ, పెట్రోల్‌పై 65 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటుంది. ఇంధన సామర్థ్య పరంగా బజాజ్ మోటార్ సైకిల్ అదిక మైలేజ్ కోరుకునే వారికి అనువుగా ఉంటుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 ముందు, వెనుక చక్రాలకు డ్రమ్ బ్రేక్ సెటప్‌తో వస్తుంది. అలాగే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ యూనిట్‌తో పాటు ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ ల్యాంప్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఎల్‌సీడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, మిస్డ్ కాల్ అలర్ట్లు, కాలర్ ఐడీ, బ్యాటరీ స్టేటస్, యూఎస్‌బీ పోర్ట్‌తో వస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ముందు భాగంలో 37ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు ప్రీలోడ్-అడ్జస్టబుల్ షోవా మోనోషాకు కలిగి ఉంది. ఎల్ఈడీ స్క్రీన్, ఎస్ఎంఎస్, కాల్ అలర్ట్లతో బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లను కలిగి ఉంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్ కేవలం రూ. 95,000, ఎక్స్- షోరూమ్ ధర నుంచి అందుబాటులో ఉంటుంది. మిడ్-రేంజ్ వేరియంట్ ధర రూ. 1.05 లక్షలు కాగా, టాప్- ఎండ్ వేరియంట్ రూ. 1.10 లక్షలుగా ఉంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐబీఎస్ వేరియంట్ ధర రూ. 95,000, ఏబీఎస్ ధర రూ. 99,500గా ఉంది. ఈ రెండు బైక్ల మధ్య ఎంపిక మీ ప్రాధాన్యతలను బట్టి ఉంటుంది. మీరు పవర్, ఫీచర్లు, స్పోర్టియర్ లుక్‌ను కోరుకుంటే హీరో ఎక్స్‌ట్రీమ్ 125 మీ ఎంపిక కావచ్చు. అయితే ఇంధన సామర్థ్యం మంచి మైలేజ్ కోరుకుంటే బజాజ్ ఫ్రీడమ్ 125ను ఎంచుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే
మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే
రామసేతు వంతెన కల్పన కాదు.. నిజం..
రామసేతు వంతెన కల్పన కాదు.. నిజం..
వావి వరుసలు మరిచి దారుణం.. సొంత చెల్లిని కూడా ??
వావి వరుసలు మరిచి దారుణం.. సొంత చెల్లిని కూడా ??
మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు
మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు
అనంత్‌ అంబానీ వివాహం.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
అనంత్‌ అంబానీ వివాహం.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు. అక్కడ సీన్‌ చూసి షాక్
అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు. అక్కడ సీన్‌ చూసి షాక్
ఉదయాన్నే ఈ జ్యూస్‌ ఒక్క గ్లాస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి !!
ఉదయాన్నే ఈ జ్యూస్‌ ఒక్క గ్లాస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి !!
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగితే ఉపయోగాలు తెలుసా ?
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగితే ఉపయోగాలు తెలుసా ?
వర్షంతో నీటమునిగిన రోడ్డు.. కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడో తెలుసా
వర్షంతో నీటమునిగిన రోడ్డు.. కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడో తెలుసా
తెల్లారేసరికి లాడ్జి‌లో మైండ్ బ్లోయింగ్ సీన్.. ఎంక్వయిరీ చేయగా
తెల్లారేసరికి లాడ్జి‌లో మైండ్ బ్లోయింగ్ సీన్.. ఎంక్వయిరీ చేయగా