SBI New FD: ఎస్బీఐ నుంచి మరో కొత్త ఎఫ్‌డీ స్కీమ్.. ఏకంగా 7.75 వడ్డీ రేటు.. త్వరపడండి..

దేశంలోని ప్రముఖ రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ను లాంచ్ చేసింది. దాని పేరు అమృత్ వృష్టి. దీనిలో సాధారణంగా అధిక వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఇది కస్టమర్ సెంట్రిక్ గా ఉండే స్కీమ్ అని.. దేశంలోని పౌరులతో పాటు నాన్ రెసిడెంట్ ఇండియన్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటుందని వివరించింది.

SBI New FD: ఎస్బీఐ నుంచి మరో కొత్త ఎఫ్‌డీ స్కీమ్.. ఏకంగా 7.75 వడ్డీ రేటు.. త్వరపడండి..
Sbi
Follow us
Madhu

|

Updated on: Jul 18, 2024 | 5:47 PM

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మార్కెట్లో మంచి డిమాండే ఉంది. అత్యధిక శాతం మంది ప్రజలు వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులకు ఇవి బెస్ట్ ఆప్షన్ గా ఉంటున్నాయి. అధిక వడ్డీతో పాటు కచ్చితమైన రాబడికి ఇవి హామీ ఇస్తుండటం, పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తుండటంతో అందరూ వీటి వైపు మొగ్గుచూపుతున్నాయి. బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థలు కూడా పోటాపోటీగా ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను తీసుకొస్తున్నాయి. మంచి వడ్డీ, ఇతర ప్రయోజనాలతో కూడిన ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్‌లను ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ను లాంచ్ చేసింది. దాని పేరు అమృత్ వృష్టి. దీనిలో సాధారణంగా అధిక వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఇది కస్టమర్ సెంట్రిక్ గా ఉండే స్కీమ్ అని.. దేశంలోని పౌరులతో పాటు నాన్ రెసిడెంట్ ఇండియన్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటుందని వివరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అమృత్ వృష్టి ఎఫ్‌డీ..

ఎస్బీఐ అందిస్తున్న అమృత్ వృష్టి ఎఫ్‌డీ స్కీమ్ లో వడ్డీ రేటు 7.25శాతం ఉంటుంది. సీనియర్ సిటిజెన్స్ కు 0.50శాతం అదనంగా వడ్డీ రేటు వర్తిస్తుంది. దీనిలో కాల వ్యవధి 444 రోజులు. 2024, జూలై 15వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలులోకి వచ్చింది. దీనిలో మీరు పెట్టే పెట్టుబడులు 444 రోజుల వరకూ లాక్ అవుతాయి. మెచ్యూరిటీ సమయానికి అధిక రాబడిని అందిస్తాయి. ఈ ఖాతాను ప్రారంభించాలనుకునేవారు ఎస్బీఐ బ్రాంచ్ లు లేదా అధికారిక వెబ్ సైట్, యోనో ఎస్బీఐ యాప్, యోనో లైట్ యాప్ ద్వారా చేయొచ్చు. ఈ అమృత్ వృష్టి స్కీమ్ 2025, మార్చి 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ లోపే పెట్టాల్సి ఉంటుంది.

ఎస్బీఐ ఇతర ఎఫ్ డీ పథకాల్లో వడ్డీ రేట్లు ఇలా..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనేక రకాల ఎఫ్డీ స్కీమ్లను అమలు చేస్తోంది. ఎస్బీఐ అమృత్ కలష్, ఎస్బీఐ వీకేర్ వంటి టాప్ పథకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన ఎస్బీఐ అమృత్ వృష్టిలో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఎస్బీఐలో ఉన్న వివిధ పథకాల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..ఇవి 2024, జూన్ 15 నుంచి అమలవుతున్న రేట్లు.

  • 7 రోజుల నుంచి 45 రోజుల వరకూ ఉండే ఎఫ్డీపై జనరల్ పబ్లిక్ కు 3.50శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 4శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • 46 రోజుల నుంచి 179 రోజుల వరకూ ఉండే ఎఫ్డీపై జనరల్ పబ్లిక్ కు 5.50శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 6శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • 180 రోజుల నుంచి 210 రోజుల వరకూ ఉండే ఎఫ్డీపై జనరల్ పబ్లిక్ కు 6.25శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 6.75శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • 180 రోజుల నుంచి 210 రోజుల వరకూ ఉండే ఎఫ్డీపై జనరల్ పబ్లిక్ కు 6.25శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 6.75శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • 211 రోజుల నుంచి ఏడాది లోపు వరకూ ఉండే ఎఫ్డీపై జనరల్ పబ్లిక్ కు 6.50శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల లోపు వరకూ ఉండే ఎఫ్డీపై జనరల్ పబ్లిక్ కు 6.80శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.30శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు వరకూ ఉండే ఎఫ్డీపై జనరల్ పబ్లిక్ కు 7శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.50శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు వరకూ ఉండే ఎఫ్డీపై జనరల్ పబ్లిక్ కు 6.75శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.25శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు వరకూ ఉండే ఎఫ్డీపై జనరల్ పబ్లిక్ కు 6.50శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.50శాతం వడ్డీ రేటు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!