Investment Tips: ఆ పథకంలో పెట్టుబడి పెడితే ఎఫ్‌డీల కంటే కళ్లు చెదిరే వడ్డీ.. అదనంగా పన్ను ప్రయోజనాలు కూడా..
ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని పథకాల వడ్డీల రేట్లు గణనీయంగా పెరిగాయి. పెట్టుబడిదారులు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్‌సీ) పథకంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందుతారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారత ప్రభుత్వం ఇటీవల ఎన్ఎస్‌సీ వడ్డీ రేటును 7.7 శాతానికి పెంచింది.
సాధారణంగా పెట్టుబడిదారులు నమ్మకమైన రాబడి కోసం ఎఫ్‌డీల్లో పెట్టుబడిపెడతారు. అయితే కొన్ని పథకాలు ఎఫ్‌డీల కంటే అధిక ప్రయోజనాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని పథకాల వడ్డీల రేట్లు గణనీయంగా పెరిగాయి. పెట్టుబడిదారులు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్‌సీ) పథకంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందుతారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారత ప్రభుత్వం ఇటీవల ఎన్ఎస్‌సీ వడ్డీ రేటును 7.7 శాతానికి పెంచింది. ఈ రేటు ప్రకారం ఈ పథకంలో రూ.1000 పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల తర్వాత రూ.1403 చేతికి వస్తుంది. అలాగే రూ.లక్ష పెట్టుబడి పెడితే ఐదేళ్ల తర్వాత రూ.1.4 లక్షలకు పైగా రాబడి పొందవచ్చు. మీరు ఎన్‌ఎస్‌సీ ఖాతాను తెరవాలంటే కనిష్టంగా రూ. 1000 పెట్టుబడి పెట్టాలి. అయితే గరిష్ట మొత్తంపై మాత్రం పరిమితి లేదు.
ఎన్ఎస్‌సీ వడ్డీ, ఆదాయపు పన్ను ప్రయోజనాలు
ఎన్ఎస్‌సీ డిపాజిట్లపై వడ్డీని వార్షికంగా లెక్కిస్తారు. కానీ సొమ్ము మాత్రం మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. అంతేకాకుండా ఈ డిపాజిట్లు సంవత్సరానికి రూ. 1.5 లక్షల పరిమితికి లోబడి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపుకు అర్హత పొందుతాయి. సెక్షన్ 80సీ కింద మినహాయింపునకు అర్హత పొందిన వివిధ పథకాల కింద పెట్టుబడులు లేని వ్యక్తులు ఎన్ఎస్‌సీ ఖాతాలో సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెడితే పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎన్ఎస్‌సీ ఖాతాదారులు సంబంధిత కార్యాలయం నుంచి వార్షిక వడ్డీకి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు. అయితే చెల్లింపు 5 సంవత్సరాల తర్వాత మాత్రమే చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం చివరిలో వచ్చే వడ్డీ ఖాతాదారుని తరఫున తిరిగి పెట్టుబడి పెట్టినట్లు లెక్కిస్తారు. ఇలా నాలుగో ఏడాది చివరి వరకూ చేస్తారు. ఈ వడ్డీ చెల్లింపు సర్టిఫికేట్ ముఖ విలువ మొత్తంతో కలిపి ఉంటుంది. ప్రస్తుతం ఎన్ఎస్‌సీ 7.7 శాతం వడ్డీ అందిస్తుంది కాబట్టి సాధారణ ఖాతాదారులకు బ్యాంకుల్లోని ఎఫ్‌డీలతో పోలిస్తే చాలా మెరుగని మార్కెట్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం