Okaya Offers: స్కూటర్‌తో సెల్ఫీ కొట్టు.. థాయ్‌ల్యాండ్ టూర్ పట్టు.. త్వరపడండి ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే..
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఓ బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. కొత్త స్కూటర్ కొనుగోలుతో పాటు థాయ్ ల్యాండ్ టూర్ వెళ్లే లక్కీ చాన్స్ కూడా కొట్టయొచ్చు. అదెలా అంటారా? ఇది చదవండి..
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఓ బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. కొత్త స్కూటర్ కొనుగోలుతో పాటు థాయ్ ల్యాండ్ టూర్ వెళ్లే లక్కీ చాన్స్ కూడా కొట్టయొచ్చు. అదెలా అంటారా? ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఒకాయ ఎలక్ట్రిక్ ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది. స్కూటర్ కొనుగోలు పై దాదాపు రూ.1750 విలువైన వివిధ రకాల ప్రయోజనాలతో పాటు పాటు రూ. 5000 వరకూ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. స్కూటర్ కొనుగోలు చేయాలంటే ఇంతకన్నా మంచి సమయం లేదు. అంతకన్నా ముందు ఈ ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోండి..
ఒకాయ ఆఫర్స్..
ఒకాయ కార్నివాల్‌లో భాగంగా కంపెనీ ఈ ఆఫర్లు అందుబాటులో చింది. థాయ్ లాండ్ ట్రిప్ ఒక్కరికి మాత్రమే ఉంటుంది. ఆఫర్ ఏప్రిల్ 30వ తేదీ వరకూ వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. అన్ని ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుపై ఈ ఆఫర్లు ఉంటాయి. వినియోదారులు టెస్ట్ డ్రైవ్ చేసి, డీలర్ తో సెల్పీ దిగాలి. ఆ ఫొటోను ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో #ridewithokayaev తో పోస్ట్ చేయాలి. దీనిని పోస్ట్ చేసిన వారే ఈ ఆఫర్ కు అర్హులు.
ఒకాయ మోడళ్లు ఇవి..
కంపెనీ ఫాస్ట్ ఎఫ్4, ఫాస్ట్ ఎఫ్3, ఫాస్ట్ ఎఫ్2ఎఫ్, ఫాస్ట్ ఎఫ్2బీ, క్లాసిక్ ఐ10 ప్లస్, ఫాస్ట్ ఎఫ్2టీ, ఫ్రీడమ్ ఎల్ఐ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. మీరు మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయొచ్చు. ఫాస్ట్ మోడళ్లను హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లుగా చెప్పుకోవచ్చు. వీటి టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు. రేంజ్ అనేది మోడల్ ప్రాతిపదికన మారుతుంది. ఫాస్ట్ ఎఫ్4 అనే మోడల్ రేంజ్ 140 నుంచి 160 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక ఫాస్ట్ ఎఫ్3 రేంజ్ రూ. 120 నుంచి 130 కిలోమీటర్లు. ఇక మిగతా మోడళ్ల రేంజ్ 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఫ్రీడమ్ స్కూటర్ ధర కేవలం రూ. 74,899 కాగా, ఫాస్ట్ ఎఫ్4 ధర 1,13,999 ఎక్స్ షోరూం నుంచి ప్రారంభమవుతాయి.
ఫీచర్లు.. కంపెనీ వీటిల్లో బీఎల్‌డీసీ హబ్ మోటార్ అమర్చింది. లిథియం ఐర్ ఫాస్టేట్ బ్యాటరీ ఉంటుంది. కెపాసిటీ మోడల్ ప్రాతిపదికన మారుతుంది. అన్నింటిలోనూ ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. టెలీ స్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. బ్యాటరీపై మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. మోటార్‌పై కూడా మూడేళ్ల వరకు వారంటీ ఉంటుంది.
ఆఫర్ క్లయిమ్ చేసుకోవడం ఎలా అంటే..
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లో ఒక ఇన్‌వాయిస్ జనరేట్ అవుతుంది. కొనుగోలు దారులకు మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఇందులో లింక్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే డిజిటల్ స్క్రాచ్ కార్డు ఉంటుంది. ఇందులో క్యాష్ బ్యాక్, థాయ్ లాండ్ ట్రిప్ వంటివి ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..