AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office Scheme: సురక్షితమైన రాబడి కావాలా.. పోస్టాఫీసు అందించే ఈ ఐదు అద్భుతమైన పొదుపు ప‌థ‌కాల్లో మీ డబ్బులు పెట్టండి..

పోస్టాఫీసు పథకాలు ఎంతో కాలంగా అందుబాటులో ఉన్న మంచి పొదుపు సాధనాలు. అంతే కాదు దీర్ఘకాలంలో మంచి రాబడి సాధించాలనుకునేవారికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో మంచి రాబడి అందించే 5 పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి పథకాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం..

Post Office Scheme: సురక్షితమైన రాబడి కావాలా.. పోస్టాఫీసు అందించే ఈ ఐదు అద్భుతమైన పొదుపు ప‌థ‌కాల్లో మీ డబ్బులు పెట్టండి..
RD Scheme
Sanjay Kasula
|

Updated on: Feb 09, 2023 | 3:18 PM

Share

న‌ష్ట భ‌యం లేకుండా దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డి సాధించాల‌నుకునేవారికి పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. పోస్టాఫీసు పథకాలు ఎప్పుడూ సురక్షితమే కాకుండా లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చు. ఆ వివరాలు మీ కోసం.. పోస్టాఫీసు పథకాలు ఎప్పుడూ సురక్షితమే కాకుండా లాభాలు ఎక్కువ. పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడితో లక్షలు ఆర్జించవచ్చు. గత ఎనిమి ఏళ్లుగా పోస్టాఫీసు కస్టమర్ల కోసం అద్భుతమైన పథకాల్ని ప్రవేశపెడుతోంది. ఈ పథకాలు సురక్షితమే కాకుండా ఎక్కువ రిటర్న్స్ తెచ్చిపెడుతున్నాయి. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం కస్టమర్లకు మంచి లాభాలు అందిస్తున్నాయి. మ్యూచ్యువల్ ఫండ్స్ కూడా లాభాల్ని ఇస్తున్నా.. రిస్క్ ఉంటుంది.

పోస్టాఫీసు పథకాల్లో మాత్రం రిస్క్ అనేది ఉండదు. మారుతున్న కాలంతో పాటు అనేక ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లు వచ్చాయి. కానీ నేటికీ చాలా మంది పాత పద్ధతిలోనే పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. నేటికీ ప్రజలు పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. మీరు వివిధ పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, వివిధ పథకాల గురించిన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం. 2023 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో మార్పులు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం..

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)

ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందే అవకాశాన్ని అందిస్తుంది. బడ్జెట్ 2023 పెట్టుబడి పరిమితిని ఒకే ఖాతాకు రూ. 9 లక్షలు, ఉమ్మడి ఖాతా కోసం రూ. 15 లక్షలకు పెంచింది. అయితే వడ్డీ రేటు 7.10 శాతంగా నిర్ణయించింది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన పెట్టుబడి ఎంపికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది మోదీ ప్రభుత్వం. ఇది 8.00 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. ప్రభుత్వం దాని పెట్టుబడి పరిమితిని రూ. 15 లక్షల నుండి రూ. 30 లక్షలకు పెంచింది.

సుకన్య సమృద్ధి యోజన

మీరు మీ ఆడపిల్లల సురక్షితమైన భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే.. మీరు సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఖాతాదారుడికి 7.6 శాతం రాబడి వస్తుంది.

కిసాన్ వికాస్ పత్రం

కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా.. మీరు 7.2 శాతం రాబడిని పొందవచ్చు. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే.. మీరు రూ. 1,000 నుంచి గరిష్టంగా ఎంత మొత్తాన్ని అయినా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మొత్తం రూ.100 గుణకారంలో మాత్రమే ఉండాలి. ఇందులో మీ డబ్బు 120 నెలల్లో రెట్టింపు అవుతుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్..

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) అనేది ఒక చిన్న పొదుపు పథకం, దీనిలో మీరు పెట్టుబడిపై 7 శాతం రాబడిని పొందుతారు. ఇందులో, మీరు రూ. 1,000 నుంచి రూ. 100 మల్టిపుల్ వరకు ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. మీరు NSCలో మొత్తం 5 సంవత్సరాల పాటు డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం