AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhar Misuse: మీ ఆధార్ దుర్వినియోగమవుతుందా? ఆన్ లైన్ చెక్ చేసుకోండిలా..!

ఆధార్ అంటే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ జారీ చేసే 12 అంకెల గుర్తింపు సంఖ్య. ఈ సంఖ్యలో మన వ్యక్తిగత సమాచారం ఉంటుంది. కాబట్టి మన ఆధార్ భద్రపర్చుకోవాల్సిన బాధ్యత మనదే.

Aadhar Misuse: మీ ఆధార్ దుర్వినియోగమవుతుందా? ఆన్ లైన్ చెక్ చేసుకోండిలా..!
Aadhar Card
Nikhil
|

Updated on: Feb 09, 2023 | 3:53 PM

Share

ప్రస్తుతం భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఉండే గుర్తింపు కార్డు ఆధార్. ప్రతి అవసరానికి ఆధార్ కార్డు ఆధారమవుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించాాలన్నా, బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్నా, ఏదైనా అప్లికేషన్ పెట్టాలన్నా ప్రతి దానికి ఆధార్ కావాల్సిందే. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఆధార్ కొంతమంది కేటుగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. మనకు తెలియకుండానే ఆధార్ ప్రామాణికతతో అకౌంట్స్ తీసుకోవడం లేదా ఓటీపీ ద్వారా మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేయడం వంటి పనులు చేస్తున్నారు. దీంతో ఎవరికైనా ప్రూఫ్ కింద ఆధార్ ఇవ్వాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఆధార్ అంటే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ జారీ చేసే 12 అంకెల గుర్తింపు సంఖ్య. ఈ సంఖ్యలో మన వ్యక్తిగత సమాచారం ఉంటుంది. కాబట్టి మన ఆధార్ భద్రపర్చుకోవాల్సిన బాధ్యత మనదే. ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ మీ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారో? లేదో? తెలుసుకోవడానికి ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనే సదుపాయాన్ని పౌరులకు కల్పించింది. యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆరు నెలల క్రితం నుంచి ఆధార్ ప్రామాణిక చరిత్రను తెలుసుకునే వెసులుబాటు ఉంది. అలాగే గరిష్టంగా 50 రికార్డులను ఒకేసారి వీక్షించవచ్చు. 

  • ఆన్ లైన్ లో ఆధార్ ప్రామాణిక హిస్టరీ తెలుసుకునే విధానం
  • మొదటగా యూఐడీఏఐ వెబ్ సైట్ కు వెళ్లాలి. అక్కడ ప్రాధాన్యత భాష కింద తెలుగు లేదా ఇంగ్లిష్ ను ఎంచుకోవాలి
  • నా ఆధార్ విభాగానికి వెళ్లాలి. అక్కడ డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది. 
  • ఆధార్ సేవల విభాగం కింద ఆధార్ అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి. మీరు కొత్త వెబ్ పేజికు వెళ్తారు.
  • అక్కడ మీ ఆధార్ నెంబర్..క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి సెండ్ ఓటీపీను క్లిక్ చేయాలి. 
  • మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీను ఎంటర్ చేసి ప్రోసీడ్ ను క్లిక్ చేయాలి. 
  • ఈ పేజీలు మీ ఆధార్ వివరాలతో పాటు గత ప్రామాణికరణ అభ్యర్థనల వివరాలు కనిపిస్తాయి.
  • మీరు ఇందులో ఏదైనా అనుమానాస్పద వినియోగాన్ని గమనిస్తే వెంటనే 1947 నెంబర్ కు కానీ లేకపోతే యూఐడీఏఐ మెయిల్ కానీ మన అభ్యర్థనను పంపవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి