Indian Railways: హమ్మయ్య.. రైల్వే ప్రయాణీలకు పెద్ద ఊరట.. అన్-రిజర్వ్డ్ టికెట్స్ ఇక చాలా ఈజీ..
భారతీయ రైల్వే ముఖ చిత్రం రోజురోజుకీ మారుతోంది. మౌలిక సదుపాయాల కల్పన మొదలు అధునాతన వందే భారత్ రైళ్ల వరకు అన్నింటిలో సమూల మార్పులు వస్తున్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎన్నో రకాల కొత్త సేవలను..

భారతీయ రైల్వే ముఖ చిత్రం రోజురోజుకీ మారుతోంది. మౌలిక సదుపాయాల కల్పన మొదలు అధునాతన వందే భారత్ రైళ్ల వరకు అన్నింటిలో సమూల మార్పులు వస్తున్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎన్నో రకాల కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సహజంగా అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను కొనుగోలు చేసేందుకు స్టేషన్‌లో క్యూ లైన్‌లో నిలబడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో స్టేషన్‌కు చేరుకునే సమయానికి ఆలస్యమవుతుంది దీంతో రైలు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి చెక్ పెట్టడానికే రిజర్వేషన్ రహిత టికెట్లను సైతం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే విధంగా ఇండియన్ రైల్వే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ‘యుటిఎస్’ పేరుతో మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇంతకీ ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి.? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
ఈ క్యాష్‌లెస్ ‘యూటిఎస్’ మొబైల్ టికెటింగ్ యాప్ ప్రత్యేకతల విషయానికొస్తే.. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి 5 మీటర్ల దూరంలో అదే విధంగా ప్రయాణం ప్రారంభించే స్టేషన్‌కు 5 కి.మీల పరిధిలో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో డబ్బులు పేమెంట్ చేసుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వేలోని ఏ యూటిఎస్ స్టేషన్ నుంచి ఏ స్టేషన్‌కైనా సీజన్, ప్లాట్‌ఫారంత పాటు రెగ్యులర్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. సీజన్ టికెట్‌ల రెన్యూవల్ పది రోజుల ముందుగానే చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్‌లో సేవ్ అయిన టికెట్‌ల బుకింగ్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌కు చూపించవచ్చు.
యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..
* ఆండ్రాయిడ్, ఐఓస్, విండోస్ ఫోన్‌లలో యుటిఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.



* అనంతరం తొలిసారి యాప్‌ను ఉయోగించే వారు సైనప్ చేసుకోవాలి.
* తర్వాత లాగిన్ అయ్యాక డ్రాప్ డౌన్ మెను నుంచి స్టేషన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* తరచుగా ప్రయాణించే వారు క్విక్ బుకింగ్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* చివరిగా ఆర్ వ్యాలెట్, పేటీఎమ్, మోబిక్విక్, ఫ్రీచార్జ్‌ల ద్వారా టికెట్‌ను కొనుగోలు చేసుకోచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..