Blaupunkt Smart TV: కేవలం రూ.6,999కే స్మార్ట్ టీవీ.. మూడు రోజులే ఆఫర్.. అస్సలు మిస్ చేసుకోవద్దు..
బ్లౌపంక్ట్ సిగ్మా(Blaupunkt Sigma) 24 ఇంచుల స్మార్ట్ టీవీ భారత మార్కెట్‍లోకి తీసుకొచ్చింది. దీన్ని మోనిటర్, టీవీ లేదా స్మార్ట్ డివైజ్ లా ఉపయోగించుకోవచ్చు. హెచ్‍డీ రెడీ రెజల్యూషన్ డిస్‍ప్లేతో ఇది వస్తోంది.

అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? దానిలో ఎంటర్టైన్మెంట్ యాప్ లు కూడా ఉండాలా? అయితే ఓ మంచి ఆప్షన్ మీకు అందుబాటులో ఉంది. కేవలం రూ.6,999 ధరతో మేడిన్ ఇండియా స్మార్ట్ టీవీ మీ కోసం ఎదురుచూస్తోంది. బ్లౌపంక్ట్ సిగ్మా(Blaupunkt Sigma) 24 ఇంచుల స్మార్ట్ టీవీ భారత మార్కెట్‍లోకి తీసుకొచ్చింది. దీన్ని మోనిటర్, టీవీ లేదా స్మార్ట్ డివైజ్ లా ఉపయోగించుకోవచ్చు. హెచ్‍డీ రెడీ రెజల్యూషన్ డిస్‍ప్లే, సన్నని అంచులతో ఈ స్మార్ట్ టీవీ వస్తోంది. ప్రస్తుతం ప్రత్యేకమైన ఇంట్రడక్టరీ ధరకు సేల్‍కు ఉంది. బ్లౌపంక్ట్ సిగ్మా 24 ఇంచుల టీవీ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, సేల్ వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రారంభ ఆఫర్ ధర ఇలా..
బ్లౌపంక్ట్ సిగ్మా 24 ఇంచ్ టీవీ ధర రూ.6,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ లో ఈ టీవీ సేల్‍కు అందుబాటులో ఉంది. రూ.6,999 ఇంట్రడక్టరీ ధర అని, ఈనెల 12వ తేదీ వరకు ఈ ధర ఉంటుందని బ్లౌంపక్ట్ పేర్కొంది. దీని అసలు ఖరీదు రూ. 10,999గా ఆ కంపెనీ పేర్కొంది.
Get the most out of your television with Sigma Series by Blaupunkt. With the 3-in-1 smart feature, it’s time to #DoItAll with a single device. Learning, working, and entertainment are made easily accessible for you!
Buy now: https://t.co/6zuxKPSQGc#Blaupunkt #Television #Sale pic.twitter.com/sNXUYmuNev
— Blaupunkt TV India (@blaupunkttv) February 7, 2023
స్పెసిఫికేషన్లు ఇవి..
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు పరిశీలస్తే.. ఈ టీవీలో 1366×768 పిక్సెల్స్ హెచ్‍డీ రెడీ రెజల్యూషన్ ఉండే 24 ఇంచుల డిస్‍ప్లే ఉంటుంది. 300 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 512జీబీ ర్యామ్, 4జీబీ స్టోరేజీతో ఈ టీవీ వస్తోంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ టీవీ పనిచేస్తుంది. క్వాడ్ కోర్ ఏ35 ప్రాసెసర్ ఉంటుంది. 20వాట్ల సౌండ్ ఔట్‍పుట్ ఇచ్చే స్పీకర్లు ఉంటాయి. సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంటుంది. మొబైళ్లు, ల్యాప్‍టాప్‍లతో పాటు సపోర్ట్ చేసే డివైజ్‍ల నుంచి స్క్రీన్ మిర్రరింగ్‍కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. 3 ఇన్ 1 లా దీనిని వినియోగించుకోవచ్చు. మోనిటర్, టీవీ లేదా స్మార్ట్ డివైజ్ లా వాడుకోవచ్చు.
కనెక్టవిటీ ఇలా..
వైఫై, బ్లూటూత్, రెండు హెచ్‍డీఎఐ పోర్టులు, రెండు యూఎస్‍బీ పోర్టులు దీనిలో ఉంటాయి. స్క్రీన్ 24 ఇంచులు ఉండటంతో మానిటర్‌గానూ ఈ టీవీని ఉపయోగించుకునేందుకు సులువుగా ఉంటుంది. హెచ్‍డీఎం కేబుల్ ద్వారా సీపీయూకు కనెక్ట్ చేసుకొని మానిటర్‌గా వినియోగించుకోవచ్చు. దీనిలో అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, యూట్యూబ్, జీ5, వూట్ వంటి యాప్‍లకు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..