Pan Aadhar Linking: పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోలేదా? మార్చి 31 నుంచి మీ పాన్ పనిచేయదంతే..!
ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పాన్ తో ఆధార్ ను లింక్ చేసుకునే గడువు మార్చి 31, 2022 లోనే ముగిసింది. అయితే కనిష్ట అపరాధ రుసుముతో మార్చి 31, 2023 వరకూ పాన్ తో ఆధార్ ను లింక్ చేసుకునే అవకాశం ఉంది.
దేశంలోని పాన్ కార్డుదారులను ఆదాయపు పన్ను శాఖ అలెర్ట్ చేసింది. పాన్ కార్డుదారులు తమ పాన్ కార్డ్స్ తో ఆధార్ నులింక్ చేసుకోపోతే మార్చి 31 నుంచి ఆ పాన్ కార్డ్స్ ఇన్ యాక్టివ్ చేస్తామని హెచ్చరించింది. ఒకవేళ ఆ పాన్ కార్డులు బ్యాంకు అకౌంట్ తో లింక్ అయ్యి ఉంటే బ్యాంక్ లావాదేవీలకు ఇబ్బందిపడాల్సి వస్తుందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పాన్ తో ఆధార్ ను లింక్ చేసుకునే గడువు మార్చి 31, 2022 లోనే ముగిసింది. అయితే కనిష్ట అపరాధ రుసుముతో మార్చి 31, 2023 వరకూ పాన్ తో ఆధార్ ను లింక్ చేసుకునే అవకాశం ఉంది. అయినా పాన్ తో ఆధార్ లింక్ చేసుకోపోతే మాత్రం పాన్ కార్డ్ ను ఇన్ యాక్టివ్ చేస్తామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆధార్, పాన్ లింక్ అపరాధ రుసుం ఇలా
పాన్‌తో ఆధార్ లింక్ 1 ఏప్రిల్ 2022 నుంచి 30 జూన్ 2022 మధ్య చేసుకుంటే పౌరులు జరిమానాగా రూ. 500 చెల్లించాలి. అయితే, ఎవరైనా ఇప్పటికీ గత సంవత్సరం పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడం మిస్ అయితే, వారు 1 జూలై 2022 నుంచి 31 మార్చి 2023 మధ్య చేయవచ్చు. కానీ రూ. 1,000 అపరాధ రుసుం చెల్లించాలి. కాబట్టి మీరు మీ పాన్ కార్డ్‌తో మీ ఆధార్ కార్డ్‌ని లింక్ చేయకుంటే మార్చి 31లోపు చేయాలి. అలా చేయడంలో విఫలమైతే మీ పాన్ కార్డ్ పని చేయకపోవచ్చు. అలాగే ఇది మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు.
ఆధార్ వెబ్ సైట్ లో ఆధార్ తో పాన్ లింక్ అయ్యిందో? లేదో? తెలుసుకోండిలా..!
- అధికారిక యూఐడీఏఐ వెబ్ సైట్ ను సందర్శించాలి.
- ఆధార్ సేవలపై క్లిక్ చేసి, ఆధార్ లింకింగ్ స్థితిని సెలెక్ట్ చేయాలి.
- ఇప్పుడు మీరు 12 అంకెల ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి తనిఖీ చేయండి అని క్లిక్ చేయాలి.
- అనంతరం వెరిఫికేషన్ కోసం మీ పాన్ నెంబర్ ను ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి.
- తర్వాత లింక్ స్థితిని తెలుసుకోండి బటన్ పై క్లిక్ చేయాలి.
- వెంటనే మీ ఆధార్ తో పాన్ లింక్ అయ్యిందో లేదో స్థితి తెలుస్తోంది.
ఎస్ఎంఎస్ ద్వారా ఇలా
ముందుగా మెసెజ్స్ లోకి వెళ్లి UIDPAN టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. తర్వాత మళ్లీ స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నెంబర్ ను ఎంటర్ చేసి 567678 లేదా 56161 నెంబర్ కు పంపాలి. తర్వాత మీ ఆధార్ తో పాన్ లింక్ అయ్యిందో లేదో స్థితి మీకు మెసెజ్ రూపంలో వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం.