Hyundai grand i10: మరో నయా కారు రిలీజ్ చేసిన హ్యూందాయ్.. ఆకట్టుకుంటున్న గ్రాండ్ ఐ10 నియోస్ ఫీచర్లు

భారతదేశంలో ఇటీవల కాలంలో కార్ల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా పెరిగిన అవసరాల నేపథ్యంలో ప్రతి ఇంట్లో కారు ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలను మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేలా తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లతో కార్లను రిలీజ్ చేస్తున్నారు. హ్యుందాయ్ కంపెనీ నుంచి విడుదలయ్యే కార్లకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది.

Hyundai grand i10: మరో నయా కారు రిలీజ్ చేసిన హ్యూందాయ్.. ఆకట్టుకుంటున్న గ్రాండ్ ఐ10 నియోస్ ఫీచర్లు
Hyundai Grand I10 Nios
Follow us
Srinu

|

Updated on: Aug 04, 2024 | 9:52 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో కార్ల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా పెరిగిన అవసరాల నేపథ్యంలో ప్రతి ఇంట్లో కారు ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలను మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేలా తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లతో కార్లను రిలీజ్ చేస్తున్నారు. హ్యుందాయ్ కంపెనీ నుంచి విడుదలయ్యే కార్లకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. మంచి ఫీచర్లు, నాణ్యత కలిగిన ఈ కార్లు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ ఆధునిక టెక్నాలజీతో వివిధ కార్లను రూపొందించి విడుదల చేస్తోంది. ఇప్పుడు దేశంలో కొత్తగా డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 సీఎన్‌జీ కారును విడుదల చేసింది. దాని ప్రత్యేకతలు, ధర వివరాలను తెలుసుకుందాం.

కొత్త కారు విడుదల

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గ్రాండ్ ఐ10 నియోస్ హెచ్‌వై- సీఎన్జీ డుయోను దేశ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త సీఎన్జీ వేరియంట్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో దీన్ని రూపొందించింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీని డ్యూయల్ సిలిండర్లతో మాగ్నా, స్పోర్ట్జ్ అనే రెండు రకాల వేరియంట్లలో విడుదల చేసింది. వీటి ధరలు రూ. 7.75 లక్షల నుంచి రూ. 8.30 లక్షల వరకూ (ఎక్స్ షోరూమ్) ఉన్నాయి.

ప్రత్యేకతలు ఇవే..

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ కారుకు అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, లెడ్ డీఆర్ఎల్, లెడ్ టెయిల్ ల్యాంప్, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ ఆన్టెన్నా ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు 20.25 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోర్టైన్‌మెంట్ సిస్టమ్, ఫుట్‌వెల్ లైటింగ్, రియర్ ఎసివెంట్స్, టిల్ట్ స్టీరింగ్ తదితర ఫీచర్లు ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఈ కారులో ప్రయాణికుల రక్షణకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. దానిలో భాగంగా అధునాతన భద్రతా ఫీచర్లతో కూడిన ఆరు ఎయిర్ బ్యాగ్‌లను ఏర్పాటు చేశారు. అదనంగా టీపీఎంఎస్ హైలైన్, వెనుక పార్కింగ్ కెమెరా, పగలూ రాత్రి ఐఆర్వీఎం, ఎలక్ట్రానిక్స్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ) తదితర ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ కార్లను రూపొందించారు.

ఇవి కూడా చదవండి

నాలుగు లక్షల యూనిట్ల విక్రయం

హ్యుందాయ్ కంపెనీ ఇప్పటి వరకూ మన దేశంలో నాలుగు లక్షల గ్రాండ్ i10 యూనిట్లను విక్రయించింది. కొత్త గ్రాండ్ ఐ10 నియోస్ హై సీఎన్జీ డియో కారు గురించి కంపెనీకి చెందిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ తమ ఖాతాదారులకు మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమ కొత్త గ్రాండ్ ఐటెన్ నియోస్ హై-సీఎన్జీ జోడీ వినియోగదారుల అన్ని అవసరాలను తీర్చగలదని భావిస్తున్నామన్నారు. ముఖ్యంగా సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోసం ఖాతాదారులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

మ‌రిన్ని బిజినెస్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి…