IDFC First Bank: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. బిల్లు చెల్లింపు నిబంధనల్లో మార్పులు..

ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. మినిమమ్ అమౌంట్ డ్యూ, చెల్లింపు గడువు తేదీతో సహా పలు కీలక సవరణాలు ఇందులో ఉన్నాయి. ఈ కొత్త అప్‌డేట్‌లు సెప్టెంబర్ 2024 నుంచి అమలులోకి వస్తాయి. ఐడీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని (ఎంఏడీ) తగ్గించాలని నిర్ణయించింది.

IDFC First Bank: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. బిల్లు చెల్లింపు నిబంధనల్లో మార్పులు..
Credit Card
Follow us
Madhu

|

Updated on: Aug 03, 2024 | 9:10 PM

క్రెడిట్ కార్డు వాడే వారు బిల్లింగ్ సైకిల్ సక్రమంగా పాటించాలి. దానిలో డ్యూ డేట్ ఉంటుంది. అంటే ఆ సమయానికి కచ్చితంగా మీరు బిల్లు మొత్తం చెల్లించాలి. అయితే దానిలో మినిమమ్ అమౌంట్ డ్యూ(ఎంఏడీ) అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మీరు చెల్లించాల్సిన మొత్తం బిల్లు కాకుండా.. కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించే అవకాశం కల్పిస్తారు. అది మీరు చెల్లించాల్సిన అసలులో కొంత పర్సెంట్ ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రతి బ్యాంకుకు వేరు వేరు శాతాలు ఉంటాయి. ఈ క్రమంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఈ మినిమమ్ అమౌంట్ డ్యూకి సంబంధించిన కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మార్పులు ఇవే..

ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. మినిమమ్ అమౌంట్ డ్యూ, చెల్లింపు గడువు తేదీతో సహా పలు కీలక సవరణాలు ఇందులో ఉన్నాయి. ఈ కొత్త అప్‌డేట్‌లు సెప్టెంబర్ 2024 నుంచి అమలులోకి వస్తాయి. ఐడీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని (ఎంఏడీ) తగ్గించాలని నిర్ణయించింది. కొత్త మినిమ్ అమౌంట్ డ్యూ రేటు.. చెల్లించాల్సిన బిల్లు మొత్తంలో ప్రస్తుతం 5 శాతం ఉండగా.. దానిని ఇప్పుడు 2 శాతానికి తగ్గించింది. ఇది వినియోగదారులకు స్వల్పకాలానికి ఉపశమనం కలిగిస్తుంది.

క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో రెండు మొత్తాలు కనిపిస్తాయి. ఒకటి నెల మొత్తం మీ క్రెడిట్ కార్డ్ బిల్లు, మరొకటి బకాయి ఉన్న కనీస మొత్తం. చెల్లించాల్సిన కనీస మొత్తం మీ బిల్లులో చాలా చిన్న భాగం, ఇది కేవలం 5 శాతం మాత్రమే. మీరు చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని చెల్లిస్తే, మీకు ఆలస్య రుసుము విధించరు. అయితే మొత్తం బిల్లుపై వడ్డీ భారీగానే పడుతుంది. ఇప్పుడు ఈ 5శాతానికి రెండు శాతానికి తగ్గించారు. స్టేట్‌మెంట్ జనరేషన్ తేదీ నుంచి చెల్లింపు గడువు తేదీని 18 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించాలని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నిర్ణయించింది. దీంతో కార్డ్ వినియోగదారులు తమ చెల్లింపులు చేయడానికి మూడు తక్కువ రోజుల సమయం ఉంటుంది. వాస్తవానికి కనీస మొత్తంలో తగ్గింపును మొదట యాక్సిస్ బ్యాంక్ అమలు చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అమలు చేసింది. అయితే ఇలాంటి ప్లాన్‌లలో ఎక్కువ రిస్క్ ఉందని భావించినందున చాలా బ్యాంకులు ఈ ధోరణిని అనుసరించకూడదని నిర్ణయించుకున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..