AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Insurance: విపత్తుల వేళ నిశ్చింతగా ఉండాలా? ఆ ఒక్కటీ చేస్తే.. మీరు భద్రం.. మీ ఇల్లు భద్రం..

రుతుపవనాల సమయంలో తుఫానులు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు వంటి వాటి వల్ల ముప్పు చాలా తీవ్రంగా ఉంటుంది. మన కారుకు అయితే కారు ఇన్సురెన్స్, ద్విచక్ర వాహనాలకు అయితే బైక్ ఇన్సురెన్స్ వంటివి ఉంటాయి. సరిగ్గా ఇలాగే ప్రకృతి వైపరిత్యాల వల్ల దెబ్బతినే ఇళ్లకు కూడా ఇన్సురెన్స్ ఉంటుంది.

Home Insurance: విపత్తుల వేళ నిశ్చింతగా ఉండాలా? ఆ ఒక్కటీ చేస్తే.. మీరు భద్రం.. మీ ఇల్లు భద్రం..
Home Insurance
Madhu
|

Updated on: Aug 03, 2024 | 9:24 PM

Share

ప్రకృతి వైపరీత్యాలు మన దేశంలో సర్వ సాధారణం. జమ్మూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఒక్కోచోట ఒక్కో రకమైన వాతావరణ పరిస్థితులు, ఒక్కోరకమైన భౌగోళిక స్థితిగతులు కనిపిస్తుంటాయి. కొన్ని చోట్ల భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. మరికొన్ని చోట్ల మెరుపు వరదలు కబళించేస్తాయి. అటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో మన ఎంత ధృడంగా కట్టడాలు నిర్మించుకున్నా.. దెబ్బతినడం సహజమే. దానిని మళ్లీ మరమ్మతులు చేయించాలంటే ఖర్చుతో కూడుకుని ఉంటుంది. అలాంటి సమయంలో మనపై ఆర్థిక భారం లేకుండా చేసేదే హోమ్ ఇన్సురెన్స్. దీని వల్ల ప్రయోజనాలు ఏంటి? ఎలా కొనుగోలు చేయాలి? తెలుసుకుందాం..

మన దేశంలో ఎక్కువే..

ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో భారత ఉపఖండం ఒకటి. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో దాదాపు 27 ప్రాంతాలలో విపత్తులు ఎక్కువగా సంభవిస్తున్నాయి. 58.6% భూభాగం మధ్యస్థం నుంచి చాలా ఎక్కువ తీవ్రతతో భూకంపాలకు గురవుతున్నాయి. 12% భూమి వరదలు, నదుల కోతకు గురవుతోంది. 7,516 కి.మీ తీరప్రాంతంలో, 5,700 కి.మీ తుఫానులు, సునామీలకు గురయ్యే అవకాశం ఉంది. 68% సాగు భూమి కరువునకు గురవుతుంది. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, హిమపాతాలు సంభవించే ప్రమాదం ఉంది. 15% భూభాగం కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది. మొత్తం 5,161 పట్టణ స్థానిక సంస్థలు వరదలకు గురయ్యే అవకాశం ఉంది.

ఇంటికి సంరక్షణ..

రుతుపవనాల సమయంలో తుఫానులు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు వంటి వాటి వల్ల ముప్పు చాలా తీవ్రంగా ఉంటుంది. మన కారుకు అయితే కారు ఇన్సురెన్స్, ద్విచక్ర వాహనాలకు అయితే బైక్ ఇన్సురెన్స్ వంటివి ఉంటాయి. సరిగ్గా ఇలాగే ప్రకృతి వైపరిత్యాల వల్ల దెబ్బతినే ఇళ్లకు కూడా ఇన్సురెన్స్ ఉంటుంది. ఈ గృహ బీమా కేవలం రక్షణ మాత్రమే కాకుండా మీరు కష్టపడి సంపాదించిన ఆస్తులను సంరక్షించే కీలకమైన పెట్టుబడి కూడా.

ఎలాంటి గృహాలకు బీమా చేయాలి..

గృహ బీమా మీ ఆస్తిని-అది బంగళా, అపార్ట్‌మెంట్, అద్దెకు తీసుకున్న ఫ్లాట్ లేదా సొంతమైన ఇల్లు వంటి వాటిని వివిధ ప్రమాదాల నుంచి రక్షించడానికి రూపొందించారు. గృహయజమానులకు ‘కచ్చా’ గృహ నిర్మాణాలకు బీమా చేసుకునే అవకాశం కూడా ఉంది.

గృహ బీమాను ఎవరు కొనుగోలు చేయాలి?

  • మీరు యజమాని, అధీకృత ఆక్యుపైయర్, భూస్వామి అయితే మీరు ఇల్లు లేదా బంగ్లా కోసం కవర్‌ను కొనుగోలు చేయవచ్చు. అద్దెదారులు కూడా వారి ఇళ్లకు బీమా కొనుగోలు చేయవచ్చు.
  • గృహ బీమాను నివాసం కోసం ఉపయోగించే ఆస్తులకు మాత్రమే కొనుగోలు చేయాలి. ఏదైనా వాణిజ్య కార్యకలాపాల కోసం రెసిడెన్షియల్ ప్రాపర్టీని ఉపయోగించినట్లయితే – గృహ బీమా కాకుండా తగిన బీమా పాలసీని కొనుగోలు చేయడం ముఖ్యం.
  • యజమానిగా మీరు బీమా చేయబడిన ఇంటిని అద్దెకు తీసుకోవచ్చు. కానీ మీరు ఆస్తిని విక్రయిస్తే, గృహ బీమా పాలసీకి స్వయంచాలకంగా రద్దు అవుతుంది.

ఈ ప్రమాదాలకు బీమా ఉంటుంది..

  • ముఖ్యంగా వర్షాకాల సమయంలో, భౌతిక నష్టం లేదా బీమా చేయబడిన ఆస్తికి నష్టం వాటిల్లినప్పుడు మీరు గృహ బీమా నుంచి ప్రయోజనం పొందవచ్చు.
  • స్టోర్మ్, సైక్లోన్, టైఫూన్, టెంపెస్ట్, హరికేన్ , టోర్మడో, సూనామీ, వరదలు, పిడుగులు, మీ ఇల్లు ఉన్న భూమి కుంగిపోవడం, ఇంటిపై చెట్లు కూలడం వల్ల అయ్యే డ్యామేజి కోసం బీమా తీసుకోవచ్చు.

గృహ బీమా కింద ఏమి కవర్ అవుతాయంటే..

సమగ్ర గృహ బీమాలో నిర్మాణానికి సంబంధించినవ, గృహోపకరణాలు, ప్రమాదకారణం మరణం, అద్దె కవర్ వంటివి ఉంటాయి.

  • నిర్మాణం.. ఈ కవర్ మీ ఇంటి నిర్మాణం కోసం. గ్యారేజ్, వరండా, నివాసం కోసం డొమెస్టిక్ అవుట్‌హౌస్‌లు, కాంపౌండ్ వాల్స్, రిటైనింగ్ గోడలు, పార్కింగ్ స్థలం, సోలార్ ప్యానెల్‌లు, వాటర్ ట్యాంక్‌లు లేదా లివింగ్ రూమ్స్, ఫిట్టింగ్‌లు, అంతర్గత రోడ్లు వంటి అదనపు నిర్మాణాలు కూడా కవర్ అవుతాయి.
  • గృహోపకరణాలు.. ఈ కవర్ మీ ఇంటిలోని గృహోపకరణాలకు రక్షణ ఇస్తుంది. టెలివిజన్, రిఫ్రిజిరేటర్, ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలు వంటి విషయాలు కవర్ అవుతాయి. మీరు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా నగలు, కళాఖండాలు, వెండి వస్తువులు, పెయింటింగ్‌లు మొదలైన విలువైన వాటిని కూడా కవర్ చేయవచ్చు.
  • ప్రమాద మరణం.. ఈ కవరేజ్ సాధారణంగా ఐచ్ఛికం. రూ. 5 లక్షల వరకు పరిమితితో వస్తుంది. ఇంటికి నష్టం కలిగించే ప్రమాదం కారణంగా బీమా చేయబడిన అతని/ఆమె జీవిత భాగస్వామి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో వర్తిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..