AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB: కస్టమర్లకు షాక్ ఇచ్చిన ప్రభుత్వ బ్యాంక్.. మీ ఈఎంఐలు ఇక మరింత భారం..

తన బ్యాంకు కస్టమర్లకు ఓ రకంగా షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. బ్యాంకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచుతున్నట్లు ఆగస్టు 1వ తేదీన ప్రకటించింది. 0.05శాతం అంటే 5 బేసిస్ పాయింట్లు ఎంసీఎల్ఆర్ పెంచుతున్నట్లు ప్రకటించడంతో ఈ బ్యాంకులో రుణాలు తీసుకున్న కస్టమర్లపై ఈఎంఐల భారం పెరగనుంది.

PNB: కస్టమర్లకు షాక్ ఇచ్చిన ప్రభుత్వ బ్యాంక్.. మీ ఈఎంఐలు ఇక మరింత భారం..
Bank Raised Mclr
Madhu
|

Updated on: Aug 03, 2024 | 9:56 PM

Share

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఒకటి. రెండు రోజుల కిందట ఈ బ్యాంకు ఓ కీలక ప్రకటన చేసింది. తన బ్యాంకు కస్టమర్లకు ఓ రకంగా షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. బ్యాంకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచుతున్నట్లు ఆగస్టు 1వ తేదీన ప్రకటించింది. 0.05శాతం అంటే 5 బేసిస్ పాయింట్లు ఎంసీఎల్ఆర్ పెంచుతున్నట్లు ప్రకటించడంతో ఈ బ్యాంకులో రుణాలు తీసుకున్న కస్టమర్లపై ఈఎంఐల భారం పెరగనుంది. ఆ భారం ఎలా ఉంటుంది? కొత్త వినియోగదారులపై కూడా ఉంటుందా? తెలుసుకుందాం రండి..

కొత్త రేట్లు ఇలా..

ప్రభుత్వ రంగ బ్యాంకైన ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకులో బెంచ్ మార్క్ ఎంసీఎల్ఆర్ రేటు ఏడాది టెన్యూర్ కలిగి ఉంటుంది. ఈ ఎంసీఎల్ఆర్ ఆధారంగానే బ్యాంకులో వాహన రుణాలు, పర్సనల్ లోన్ల వడ్డీ రేట్లను బ్యాంకు నిర్ణయిస్తుంది. కాగా ఇప్పుడు బ్యాంకు తీసుకున్న కొత్త నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 8.25శఆతం నుంచి 8.30 శాతానికి పెంచింది. ఏడాది టెన్యూర్ గల ఎంసీఎల్ఆర్ రేటు 8.85శాతం నుంచి 8.90శాతానికి చేరింది. ఇక మూడేల్ల టెన్యూర్ గల ఎంసీఎల్ఆర్ రేట 9.20శాతానికి పెరిగింది. ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన రెగ్యూలేటర్ ఫైలింగ్ లో పేర్కొంది.

అసలు ఎందుకు ఈ ఎంసీఎల్ఆర్..

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) అనేది బ్యాంకు రుణంపై విధించే కనీస వడ్డీ రేటు. దీనిని బ్యాంకులు బెంచ్ మార్క్ గా బ్యాంకులు పరిగణిస్తాయి. ఈ ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఫలితంగా వినియోగదారులపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ ఎంసీఎల్ఆర్ రేట్లను సవరించి 2024 ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలు చేస్తోంది. దీంతో తన వినియోగదారులపై వడ్డీ భారం పెరగనుంది. ఫలితంగా నెలనెలా చెల్లించాల్సిన ఈఎంఐలు పెరగనున్నాయి. అయితే ఫిక్స్ డ్ వడ్డీ రేట్లపై రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు మార్పులు ఉండవు. ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు తీసుకున్న వారికి మాత్రం అదనపు భారం పడుతుంది. సాధారణంగా బ్యాంకులు హోమ్ లోన్స్, బైక్ లోన్స్, పర్సనల్ లోన్ల వంటివి ఇచ్చే ముందు ఫ్లోటింగ్ వడ్డీ రేట్లకే ఇస్తాయి.

మరో బ్యాంక్..

పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు మరో ప్రభుత్వ రంగా రుణదాత అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా కూ ఎంసీఎల్ఆర్ ను పెంచింది. ఒక సంవత్సరం కాల వ్యవధికి 5 బేసిస్ పాయింట్లు పెంచి 8.95శాతం చేసింది. అయితే, మిగిలిన కాల వ్యవధిలో రేట్లు మారలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.