Gold Price: మళ్లీ మొదలైన బంగారం ధరల పెరుగుదల… తులం ధర ఎంతకు చేరిందో తెలుసా.?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బంగారం ధర ఒక్కసారిగా తగ్గిన విషయం తెలిసిందే. తులం బంగారంపై ఒకేసారి ఏకంగా రూ. 4 వేల వరకు తగ్గడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా మళ్లీ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. బంగారంపై దిగుమతి సుంకం తగ్గితే ధర తగ్గాలి కానీ...
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బంగారం ధర ఒక్కసారిగా తగ్గిన విషయం తెలిసిందే. తులం బంగారంపై ఒకేసారి ఏకంగా రూ. 4 వేల వరకు తగ్గడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా మళ్లీ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. బంగారంపై దిగుమతి సుంకం తగ్గితే ధర తగ్గాలి కానీ దీనికి విరుద్ధంగా జరుగుతోంది. దీనికి ప్రధాన కారణాల్లో.. సెప్టెంబర్ లో వడ్డీరేట్ల తగ్గుదల, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, ముఖ్యంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు దీనికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. మరి ఆదివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,850కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 70,730 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబయిలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 64,700గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 70,580 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,360 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,700, 24 క్యారెట్ల బంగారం ధర ర. 70,580 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,580 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,700, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,580 వద్ద్ కొనసాగుతోంది. విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధర ఎలా ఉందంటే..
వెండి ధర విషయానికొస్తే.. ఆదివారం వెండి ధరలో పెద్దగా మార్పు కనిపించలేదు. న్యూఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 85,500వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్నంతో కిలో వెండి ధర రూ. 90,900 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి…