Mahindra Cars: ఆ కార్ల కొనుగోలుపై రూ. 1.25లక్షల వరకూ డిస్కౌంట్.. ఈ నెలాఖరు వరకే అవకాశం..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా కూడా పలు కార్లపై బంపర్ ఆఫర్లను ప్రకటించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ300, మరాజో, బొలెరో, బొలెరో నియో కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ ఆఫర్లు కేవలం అక్టోబర్ నెలాఖరు వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఫెస్టివ్ సీజన్ వచ్చిందంటే మార్కెట్ కు జోష్ వస్తుంది. ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ కస్టమర్లను ఆకర్షించేందుకు అన్న రంగాల వ్యాపారులు ప్రయత్నాలు చేస్తుంటారు. పైగా దసరా పండుగ వచ్చే సమయానికి అందరూ కొత్త వస్తువులు కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. అందుకే కంపెనీలు కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్లు, డిస్కౌంట్లు తీసుకొస్తుంటాయి. ఇదే క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా కూడా పలు కార్లపై బంపర్ ఆఫర్లను ప్రకటించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ300, మరాజో, బొలెరో, బొలెరో నియో కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ ఆఫర్లు కేవలం అక్టోబర్ నెలాఖరు వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. మహీంద్రా కార్లపై ఉన్న ఆఫర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
మహీంద్రా ఎక్స్‌యూవీ400.. మహీంద్రా నుంచి వస్తున్న ఏకైక ఎలక్ట్రిఫైడ్ వాహనం ఎక్స్‌యూవీ400. ఈ కారుపై రూ. 1.25 లక్షల ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. భారతదేశంలో, ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ ధర రూ. 15.99 లక్షల నుంచి రూ. 19.39 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది అయితే ఈ కారును ఈ నెలలో ఆఫర్ పై రూ. 14.74 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
మహీంద్రా ఎక్స్‌యూవీ300.. ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లు రెండింటిపై ఈ నెలలో రూ. 4,000 నుంచి రూ. 90,000 వరకు తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. అయితే వేరియంట్ ఆధారంగా తగ్గింపులు, ఉచిత ఉపకరణాలలో తేడాలు ఉంటాయి. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కార్ల ధర మన దేశంలో రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 14.61 లక్షల వరకు ఉంటుంది. రెండూ ఎక్స్-షోరూమ్ ధరలు.
మహీంద్రా మరాజ్జో.. ఈ నెల, మహీంద్రా మరాజో ఎంపీవీ అన్ని వేరియంట్‌లపై రూ. 73,300 వరకు తగ్గింపు లభిస్తుంది. అదనంగా రూ. 15,000 విలువైన ఉపకరణాలు ఉచితంగా అందిస్తారు. ఈ కారులో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. 121బీహెచ్పీ, 300ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధరలు రూ. 13.41 లక్షల నుంచి రూ. 15.70 లక్షల మధ్య ఉంది.
మహీంద్రా బొలెరో.. ఈకారు మూడు ట్రిమ్ స్థాయిలలో లభిస్తుంది. బీ4, బీ6, బీ6(ఓ) వీటి ధరలు రూ. 9.78 లక్షల నుంచి రూ. 10.79 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకూ ఉంటుంది. ఈ నెలలో మోడల్‌ను బట్టి రూ. 35,000 నుంచి 70,000 వరకు అద్భుతమైన ఆఫర్‌లను కంపెనీ అందిస్తోంది.. బీ4పై రూ. 30,000, బీ6పై రూ. 15,000, బీ6(ఓ)పై రూ. 50,000 తగ్గింపుతో పాటు రూ. 20,000 ఉచిత యాక్సెసరీలను ఆఫర్లో ఉన్నాయి. బొలెరో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 75బీహెచ్పీ, 210ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది.
మహీంద్రా బొలెరో నియో.. ఈ కారుపై రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ మహీంద్రా కారు నాలుగు ట్రిమ్‌లలో లభ్యమవుతోంది. ఎన్4,ఎన్8, ఎన్10, ఎన్10(ఓ) మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్4, ఎన్8లపై రూ. 5000 నుంచి రూ. 11,000 తగ్గింపులు లభిస్తాయి. ఎన్10, ఎన్10(ఓ)మోడళ్లపై రూ. 30,000 వరకూ తగ్గింపు లభిస్తుంది. అదనంగా మరో రూ. 20,000 విలువైన ఉచిత యాక్సెసరీస్ లభిస్తాయి. బొలెరో నియో ధర రూ. 9.63 లక్షల నుంచి రూ. 12.14 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




