Diesel Cars: డీజిల్ కారు కొంటున్నారా..? అయితే ఒక్క నిమిషం.. ఇవి గుర్తుపెట్టుకోండి.!
భారతదేశంలో డీజిల్ కార్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మైలేజ్ కోసం ఎక్కువగా ఆలోచించే భారతీయులు రేట్ ఎక్కువైనా కొనేస్తుంటారు. దేశంలో డీజిల్ రేటు కూడా పెట్రోల్ రేటుతో పోలిస్తే తక్కువగా ఉండటం ఒక కారణం. కేంద్ర ప్రభుత్వం డీజిల్ వాహనాలను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. డీజిల్ కార్లపై టాక్స్‌లు పెంచుతూ..

భారతదేశంలో డీజిల్ కార్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మైలేజ్ కోసం ఎక్కువగా ఆలోచించే భారతీయులు రేట్ ఎక్కువైనా కొనేస్తుంటారు. దేశంలో డీజిల్ రేటు కూడా పెట్రోల్ రేటుతో పోలిస్తే తక్కువగా ఉండటం ఒక కారణం. కేంద్ర ప్రభుత్వం డీజిల్ వాహనాలను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. డీజిల్ కార్లపై టాక్స్‌లు పెంచుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిస్తూ కొంత పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం చేస్తోంది. అయినా ఇప్పటికీ ప్రజలు డీజిల్ కార్లపై మక్కువ చూపిస్తున్నారు. డీజిల్ ధర తక్కువ కావడం, మైలేజ్ ఎక్కువగా ఇవ్వడంతో పాటు.. పవర్‌ఫుల్ ఇంజిన్‌తో ఈ మధ్య డీజిల్ కార్లు వస్తున్నాయి. ఇప్పటివరకు డీజిల్ కార్లలో డీజిల్ పోస్తే చాలు అని మీరు అనుకుంటున్నారా.? కానీ గుర్తు పెట్టుకోండి మీరు కొత్తగా డీజిల్ కారు కొన్నట్లయితే.. డీజిల్‌తో పాటు యాడ్ బ్లూ అనే ఆయిల్ కూడా పోయించాల్సి ఉంటుంది. డీజిల్ ట్యాంక్ పక్కనే, మరో ఆయిల్ గొట్టం కనిపిస్తుంది. అందులోనే యాడ్ బ్లూ ఆయిల్ కొట్టించాలి.
అసలు ఏంటి ఈ యాడ్ బ్లూ ఆయిల్.?
ఇది ఒక లిక్విడ్ యూరియా.. ఇది డీజిల్‌తో కలవడం ద్వారా, డీజిల్ మండినప్పుడు వచ్చే అనేక పర్యావరణ హాని ఉత్పరకాలను ఆపుతుంది. డీజిల్ నుంచి బయటకు వచ్చే లెడ్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే… పర్యావరణానికి డీజిల్ కార్ల పొగ వల్ల వచ్చే హానిని తగ్గిస్తుంది. చాలాసార్లు పెట్రోల్ బంకుల్లో డీజిల్‌తో పాటు కొన్ని పాకెట్స్‌ను కట్ చేసి డీజిల్ ట్యాంక్‌లోకి పోయడం చూస్తుంటాం. ఇది కూడా అలాంటిదే.
అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చే బీఎస్-6 వాహనాలకు ఇది తప్పనిసరి చేసింది. వాహనంలోనే దీన్ని ఇన్బిల్ట్ చేసింది. దీంతో డీజిల్‌తో పాటు ఈ యాడ్ బ్లూ ఆయిల్‌ను కూడా వాహనదారులు కచ్చితంగా నింపాల్సిందే. అయితే డీజిల్ పోయించుకున్న ప్రతిసారి యాడ్ బ్లూ పోయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి లీటర్ యాడ్ బ్లూ ఆయిల్ 1000 కిలోమీటర్లకు పనికొస్తుంది. ఇది 70 రూపాయలకు మార్కెట్లో అందుబాటులో ఉంది. కొత్తగా వచ్చే డీజిల్ కార్లలో 10 లీటర్లు పట్టే యాడ్ బ్లూ ఆయిల్ ట్యాంక్‌ని సపరేట్‌గా ఇన్బిల్ట్ చేస్తున్నారు. సో..! కొత్తగా డీజిల్ కార్లు కొనుక్కునేవారికి ఇది ఒక అదనపు భారం కూడా. అయితే దీని వల్ల కారు మైలేజ్ కూడా కొంత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..