AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంక్ సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..

అక్టోబర్ లాంగ్ వీకెండ్ అంటూ దసరా పండుగ కావడంతో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభావిత ప్రాంతాల్లోని బ్యాంకులు వరుసగా 4 రోజుల పాటు మూసి ఉండడమే ఇందుకు కారణం. సాధారణంగా బ్యాంకులకు వారానికి ఒకటి లేదా రెండు రోజులు సెలవులు ఉంటాయి. నెలలో అన్ని ఆదివారాలు కాకుండా, రెండవ, నాల్గవ శనివారాలు కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి..

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంక్ సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..
Bank Holidays
Subhash Goud
|

Updated on: Oct 14, 2023 | 6:20 PM

Share

దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ఊపందుకుంది. దసరా (విజయదశమి) దుర్గా పూజ అక్టోబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పండుగల పరంపర కొనసాగుతుంది. దసరా పూజ అనేది దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలో ఏదో ఒక రూపంలో జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా పండగ సీజన్‌తో పాటు సెలవుల సందడి కూడా ఉండడం సహజమే. ముఖ్యంగా దసరా సందర్భంగా బ్యాంకులకు భారీ సెలవులు రానున్నాయి. అందుకే బ్యాంకు వినియోగదారులు ముందస్తుగా ఈ సెలవులను గమనించి బ్యాంకుల పనులకు ప్లాన్ చేసుకోండి. బ్యాంకులు మూత పడకముందే పనులు చేసుకోవడం బెటర్.

అక్టోబర్ లాంగ్ వీకెండ్ అంటూ దసరా పండుగ కావడంతో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభావిత ప్రాంతాల్లోని బ్యాంకులు వరుసగా 4 రోజుల పాటు మూసి ఉండడమే ఇందుకు కారణం. సాధారణంగా బ్యాంకులకు వారానికి ఒకటి లేదా రెండు రోజులు సెలవులు ఉంటాయి. నెలలో అన్ని ఆదివారాలు కాకుండా, రెండవ, నాల్గవ శనివారాలు కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ కారణంగా ప్రతి రెండవ వారానికి బ్యాంకులలో రెండు రోజుల వారాంతం ఉంటుంది.

వచ్చే వారం లాంగ్ వీకెండ్:

అయితే ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉండబోతోంది. చాలా రాష్ట్రాల్లో అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 24 వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అక్టోబరు 21వ తేదీ నెలలో మూడవ శనివారం, అయితే ఆ రోజు మహాసప్తమి కారణంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 21న త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 22 ఆదివారం అయితే దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

ఇవి కూడా చదవండి

ఈ 3 రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి:

అక్టోబర్ 23, సోమవారం, విజయదశమి సందర్భంగా త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి. ఆ తర్వాత, అక్టోబర్ 24, మంగళవారం, దసరా రోజున దుర్గాపూజ సందర్భంగా త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ విధంగా మూడు రాష్ట్రాల్లో త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకుల పనితీరు ప్రభావితమవుతుంది.

ఈ నెల సెలవులతో ప్రారంభమైంది:

ఈసారి అక్టోబర్ నెల సెలవుల పరంగా ప్రత్యేకతను చాటుతోంది. సుదీర్ఘ సెలవులతో నెల ప్రారంభమైంది. ఈ నెల మొదటి తేదీ అంటే అక్టోబర్ 1 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది. ఆ తర్వాత, గాంధీ జయంతి జాతీయ సెలవుదినం కారణంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడు ఈ 4 రోజుల వీకెండ్ వచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటలపాటు..
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటలపాటు..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ చరిత్ర
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ చరిత్ర
డబ్బే డబ్బు..! బుధ, శుక్రుల పరివర్తనతో వీరికి ధన యోగాలు..
డబ్బే డబ్బు..! బుధ, శుక్రుల పరివర్తనతో వీరికి ధన యోగాలు..
తెల్లని పువ్వులాంటి సగ్గుబియ్యం వడియాలు..
తెల్లని పువ్వులాంటి సగ్గుబియ్యం వడియాలు..
అలారం పెట్టుకోండి ఫ్యాన్స్.. ఉదయం 7:30కే టీమిండియా మ్యాచ్
అలారం పెట్టుకోండి ఫ్యాన్స్.. ఉదయం 7:30కే టీమిండియా మ్యాచ్
మీ గురక శబ్దం పక్కింటి వరకు వినిపిస్తోందా? తగ్గించుకోవడానికి ఇలా
మీ గురక శబ్దం పక్కింటి వరకు వినిపిస్తోందా? తగ్గించుకోవడానికి ఇలా
ఫ్రిజ్‌ను ఇలా క్లీన్‌ చేస్తే ఎంత పాతగా ఉన్నా కొత్తదానిలా..
ఫ్రిజ్‌ను ఇలా క్లీన్‌ చేస్తే ఎంత పాతగా ఉన్నా కొత్తదానిలా..
‘అర్నబ్’ తుపాను బాధితులకు అండగా టాలీవుడ్ డైరెక్టర్.. వీడియో వైరల్
‘అర్నబ్’ తుపాను బాధితులకు అండగా టాలీవుడ్ డైరెక్టర్.. వీడియో వైరల్
గే డేటింగ్ యాప్‌లో పరిచయం.. తియ్యని మాటలతో యువకుడి కొంపముంచిన..
గే డేటింగ్ యాప్‌లో పరిచయం.. తియ్యని మాటలతో యువకుడి కొంపముంచిన..
పుల్లపుల్లగా కారకారంగా పల్లెటూరి స్టైల్ చింతచిగురు చికెన్
పుల్లపుల్లగా కారకారంగా పల్లెటూరి స్టైల్ చింతచిగురు చికెన్