Fiber Axis Card: నంబర్ లేని క్రెడిట్ కార్డు.. వినడానికి కొత్తగా ఉన్నా యాక్సిస్ బ్యాంక్ సాధ్యం చేసేసిందిగా..!
ముఖ్యంగా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి వారిని టార్గెట్ చేస్తూ మోసగాళ్లు కార్డు నెంబర్ అడిగి ఓటీపీ ద్వారా మోసాలు చేస్తున్నారు. ఈ మోసాలను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలతో ముందుకు వస్తున్నారు. వీటిని అరిట్టేందకు నెంబర్ లెస్ కార్డులను యాక్సిస్ బ్యాంక్ రూపొందించింది. ఈ తాజా కార్డు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. పెరిగిన టెక్నాలజీ ప్రకారం ఆన్‌లైన్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఈ మోసాలన్నీ మన క్రెడిట్ కార్డు నెంబర్ ఆధారంగానే జరగుతాయి. ముఖ్యంగా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి వారిని టార్గెట్ చేస్తూ మోసగాళ్లు కార్డు నెంబర్ అడిగి ఓటీపీ ద్వారా మోసాలు చేస్తున్నారు. ఈ మోసాలను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలతో ముందుకు వస్తున్నారు. వీటిని అరిట్టేందకు నెంబర్ లెస్ కార్డులను యాక్సిస్ బ్యాంక్ రూపొందించింది. ఈ తాజా కార్డు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
గతంలో ఎర్లీ శాలరీగా పిలిచే ఫైబ్, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో టెక్ అవగాహన ఉన్న జెన్‌జెడ్‌ఎస్ కోసం భారతదేశంలో మొట్టమొదటి నంబర్‌లెస్ క్రెడిట్ కార్డు సేవలను ప్రారంభించాయి. నంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్‌తో కార్డ్ ప్లాస్టిక్‌పై కార్డ్ నంబర్, గడువు తేదీ లేదా సీవీవీ ముద్రించరు కాబట్టి కస్టమర్లు అదనపు స్థాయి భద్రతను పొందుతారు. ఇది సంపూర్ణ భద్రత, గోప్యతను నిర్ధారిస్తూ కస్టమర్ కార్డ్ వివరాలకు గుర్తింపు దొంగతనం లేదా అనధికారిక యాక్సెస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కస్టమర్‌లు ఫైబ్ యాప్‌లో వారి ఫైబ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వివరాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వారి సమాచారంపై వారికి పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ కార్డుల ఫీచర్లు ప్రయోజనాలను కూడా ఓ సారి తెలుసుకుందాం.
ఫైబ్ యాక్సిస్ ఫీచర్లు, ప్రయోజనాలు
ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అన్ని రెస్టారెంట్ అగ్రిగేటర్‌లలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీపై ఫ్లాట్ 3 శాతం క్యాష్‌బ్యాక్, ప్రముఖ రైడ్-హెయిలింగ్ యాప్‌లలో లోకల్ కమ్యూట్, ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వినోదం వంటి ఫీచర్లను అందిస్తుంది. అదనంగా కస్టమర్లు అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు. ఈ కార్డ్ రూపే ద్వారా అందిస్తారు కాబట్టి కస్టమర్లు యూపీఐ సేవలను కూడా వినియోగించుకోవచ్చు. ఈ కార్డు అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఆమోదిస్తారు. ముఖ్యంగా వినియోగదారుల అదనపు సౌలభ్యం కోసం ట్యాప్-అండ్-పే ఫీచర్‌ను కూడా అందిస్తుంది. ఈ కార్డును సున్నా జాయినింగ్ ఫీజు, జీవితకాలం కోసం జీరో వార్షిక రుసుముతో ప్రారంభించవచ్చు. ఈ కార్డులోని కొన్ని ఇతర ఫీచర్‌లలో సంవత్సరానికి నాలుగు దేశీయ విమానాశ్రయ లాంజ్‌లకు యాక్సెస్ , ఇంధన ఖర్చుల కోసం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు పొందవచ్చు. అలాగే యాక్సిస్ డైనింగ్ డిలైట్స్‌తో పాటు రూపే పోర్ట్‌ఫోలియో ఆఫర్లను కూడా పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..