Add On Credit Card: దరఖాస్తు లేకుండానే క్రెడిట్ కార్డు.. మీ భార్య, పిల్లల అవసరాల కోసం.. పూర్తి వివరాలు ఇవి..
మీరు క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, మీరు మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్‌తో సహా మీ అర్హతలను తెలియజేసే పత్రాలను అందించాలి. అయితే యాడ్ ఆన్ కార్డుకు అవేవి అవసరం లేదు. బ్యాంకులు ఇప్పటికే మీ ప్రాథమిక క్రెడిట్ కార్డ్ వివరాలను కలిగి ఉన్నందున యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌లకు ఈ అవసరం ఉండదు. ప్రాథమిక క్రెడిట్ కార్డ్‌కు అనుబంధంగా యాడ్-ఆన్ కార్డ్‌లు జారీ చేస్తారు.
మీరు క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారా? సమయానికి పేమెంట్స్ చేసేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఇప్పుడు మీరు వినియోగిస్తున్న కార్డుపైనే మరో క్రెడిట్ కార్డు బ్యాంకులు మీకు అందిస్తాయి. వాటిని మీ భార్య, పిల్లలు, లేదా ఎవరైనా కుటుంబ సభ్యులకు ఇవ్వవచ్చు. దీనిని యాడ్ యాన్ కార్డు అంటారు. ఇది సప్లిమెంటరీ లేదా సెకండరీ కార్డు లాంటి అన్నమాట. దీని సాయంతో కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా రెండు కార్డులను ఇద్దరు వ్యక్తులు వినియోగించుకోవచ్చు. అయితే దానిని ఎలా తీసుకోవాలి? ఇతర ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..
మీరు క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, మీరు మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్‌తో సహా మీ అర్హతలను తెలియజేసే పత్రాలను అందించాలి. అయితే యాడ్ కార్డుకు అవేవి అవసరం లేదు. బ్యాంకులు ఇప్పటికే మీ ప్రాథమిక క్రెడిట్ కార్డ్ వివరాలను కలిగి ఉన్నందున యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌లకు ఈ అవసరం ఉండదు. ప్రాథమిక క్రెడిట్ కార్డ్‌కు అనుబంధంగా యాడ్-ఆన్ కార్డ్‌లు జారీ చేస్తారు. ఈ యాడ్-ఆన్‌ల ద్వారా జరిగే అన్ని లావాదేవీలు అన్నీ కూడా దానికి అనుబంధంగా ఉన్న ప్రాథమిక క్రెడిట్ కార్డ్ పైనే వస్తాయి. అసలు కార్డు కలిగి ఉన్న వారే రెండు కార్డుల బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.
యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ ఎలా పని చేస్తుందంటే..
క్రెడిట్ రీపేమెంట్ చరిత్ర ఆధారంగా, రుణదాతలు మీ ప్రాథమిక కార్డ్‌లో యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌లను మీకు అందిస్తారు. ప్రాథమిక కార్డ్ హోల్డర్ తన క్రెడిట్ కార్డ్‌తో లింక్ అయిన యాడ్-ఆన్ కార్డ్‌ల వినియోగాన్ని ట్రాక్ చేయగలుగుతారు. అంటే యాడ్ ఆన్ కార్డు ద్వారా ఏ లావాదేవి జరిపినా అసలు కార్డు యజమానికి తెలుస్తుంది. యాడ్ కార్డుతో బాధ్యతారహితంగా ఖర్చు చేసినట్లయితే మీరు వాటిని నిరోధించే అవకాశం దీని వల్ల వస్తుంది.
లిమిట్ తో జాగ్రత్త.. యాడ్ ఆన్ కార్డుతో ప్రయోజనాలున్నప్పటికీ అది క్రెడిట్ యుటిలైజేషన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా 30శాతం క్రెడిట్ లిమిట్ వాడుకోవడమే మంచిది. కానీ ఇప్పుడు ఉన్న కార్డుతో పాటు యాడ్ కార్డు కూడా ఒకేసారి వినియోగిస్తుండంతో ఈ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో పెరిగిపోతుంది. దీనివల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. కాబట్టి ఖర్చులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
దరఖాస్తు ఇలా..
ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో యాడ్-ఆన్ కార్డ్‌ల కోసం అభ్యర్థించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లోనూ అప్లై చేయొచ్చు. లేదా సమీపంలోని బ్యాంకు శాఖను సందర్శించవచ్చు. లేదా బ్యాంక్ కస్టమర్ కేర్‌ను కూడా సంప్రదించవచ్చు
రుసుములు, ఛార్జీలు..
సాధారణంగా, మీరు యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ కోసం చెల్లించాల్సిన కొన్ని రుసుములు ఉన్నాయి. మీరు దరఖాస్తు చేసుకున్న బ్యాంక్, కార్డ్ రకాన్ని బట్టి ఇది రూ. 100 నుంచి రూ. 1000 మధ్య ఉండవచ్చు. అయినప్పటికీ, కొంత మంది క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు వినియోగదారులను ఆకర్షించడానికి యాడ్-ఆన్ కార్డ్‌లను ఉచితంగా అందిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..