OTT: రూటూ మారుస్తోన్న ఓటీటీ వేదికలు.. మొన్న హాట్‌స్టార్‌, నేడు అమెజాన్‌ ప్రైమ్‌.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒక్క జియో తప్ప మిగితావన్నీ సబ్‌స్క్రిప్షన్‌తోనే సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా వరకు ఓటీటీలు కంటెంట్‌ను అందించే క్రమంలో ఇప్పటి వరకు ప్రకటనలపై (యాడ్స్‌)పై దృష్టిసారించలేవు. ఒక్క డిస్నీ+ హాట్‌స్టార్‌ మినహాయిస్తే ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఏవీ కంటెంట్‌ మధ్యలో యాడ్స్‌ను ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు ఓటీటీ...

OTT: రూటూ మారుస్తోన్న ఓటీటీ వేదికలు.. మొన్న హాట్‌స్టార్‌, నేడు అమెజాన్‌ ప్రైమ్‌.
Amazon Prime
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 24, 2023 | 6:47 AM

వినోద రంగంలో ఒక సంచలనం ఓటీటీ. ఎంటర్‌టైన్‌మెంట్ రంగం ముఖచిత్రాన్ని మార్చేసింది ఓటీటీ. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, క్రికెట్‌, టాక్‌ షోలు ఒక్కటేంటీ.. కాదేదీ ఓటీటీకి అనర్హం అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. బడా బడా స్టార్‌లు సైతం ఓటీటీ ప్రాజెక్ట్స్‌ కోసం పనిచేసే రోజులు వచ్చాయంటేనే పరిస్థితులు ఎంతలా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో కొనసాగుతోన్న ఎన్నో బడా సంస్థలు సైతం ఓటీటీ రంగలోకి విస్తరించాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒక్క జియో తప్ప మిగితావన్నీ సబ్‌స్క్రిప్షన్‌తోనే సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా వరకు ఓటీటీలు కంటెంట్‌ను అందించే క్రమంలో ఇప్పటి వరకు ప్రకటనలపై (యాడ్స్‌)పై దృష్టిసారించలేవు. ఒక్క డిస్నీ+ హాట్‌స్టార్‌ మినహాయిస్తే ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఏవీ కంటెంట్‌ మధ్యలో యాడ్స్‌ను ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ ఆ దిశగా ప్రయత్నం మొదలు పెడుతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో ఏదైనా సినిమా కానీ వెబ్‌ సిరీస్‌ కానీ చూస్తే మొదట్లోనే ఒక యాడ్‌ వస్తుంది. ఈ వీడియోను స్కిప్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఒక్కసారి వీడియో మొదలైతే చివరి వరకు ఎలాంటి ప్రకటనలు లేకుండా సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చు. అయితే ఇకపై కంటెంట్‌ మధ్యలో యాడ్స్‌ను ప్రసారం చేయాలని అమెజాన్‌ ప్రైమ్‌ డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. అమెరికాతో పాటు పల దేశాల్లో ఇకపై ప్రైమ్‌లో కంటెంట్‌ చూడాలంటే ప్రేక్షకులు యాడ్స్‌ను భరించాల్సిందే. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తులు కూడా మొదలు పెట్టేశారు. 2024 నుంచి దీనిని అమల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.

ఇదిలా ఉంటే యూజర్స్‌ ఎలాంటి యాడ్స్‌ లేకుండా కంటెంట్‌ను చూసే అవకాశం కూడా ఉంది. అయితే ఇందు కోసం ప్రత్యేకంగా మరికొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌కు ఇది అదనంగా ఉంటుందన్నమాట. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధర రూ. 899గా ఉండగా, ఎలాంటి యాడ్స్‌ లేకుండా కంటెంట్‌ను చూడాలంటే ‘సూపర్+ ప్లాన్‌’తో రూ. 1099 చెల్లించాల్సి ఉంటుంది. ప్రైమ్‌ కూడా ఇలాంటి ప్లాన్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ కేవలం సబ్‌స్క్రిప్షన్స్‌ ద్వారా మాత్రమే కాకుండా ఇలా అదనపు ఆదాయాన్ని ఆర్జించడానికి ఇలాంటి చర్యలకు దిగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..