Stock Market: ఏకంగా 2000శాతం రాబడిని అందించే షేర్ ఇది.. కేవలం రూ. 10వేల పెట్టుబడితో రూ. 2లక్షల ఆదాయం.. పూర్తి వివరాలు ఇవి..

అయితే ఇప్పుడు మల్టీ బ్యాగ్గర్ స్టాక్ ను మీకు పరిచయం చేయబోతున్నాం.  కేవలం పదేళ్ల కాల వ్యవధిలో రూ. 10,000 స్టాక్ ను రూ. 2లక్షలకు పెంచింది. ఆ స్టాక్ ఎంటంటే ఎల్టీ ఫుడ్స్. ఇది గత మూడేళ్ల కాలంలో 495 శాతం తన స్టాక్ వాల్యూని పెంచుకుంది. మొత్తం మీద పదేళ్ల కాలంలో 2000శాతం లాభాలను తెచ్చిపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Stock Market: ఏకంగా 2000శాతం రాబడిని అందించే షేర్ ఇది.. కేవలం రూ. 10వేల పెట్టుబడితో రూ. 2లక్షల ఆదాయం.. పూర్తి వివరాలు ఇవి..
Stock Market
Follow us
Madhu

|

Updated on: Sep 24, 2023 | 7:00 AM

షేర్ మార్కెట్ తక్కువ సమయంలోనే అధిక రాబడులు ఇచ్చే ఓ అద్భుతమైన విధానం. అయితే దీనిపై అవగాహన ఉండాలి. బిజినెస్ టెర్మినాలజీని అర్థం చేసుకోగలగాలి. బిజినెస్ ట్రెండ్స్ ను పట్టుకోవాలి. మంచి స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు ఊహించినంత రాబడులు వచ్చే అవకాశాలుంటాయి. అది కూడా మార్కెట్ పరిస్థితిని బట్టి ఆధార పడి ఉంటుంది. అయితే ఇప్పుడు మల్టీ బ్యాగ్గర్ స్టాక్ ను మీకు పరిచయం చేయబోతున్నాం.  కేవలం పదేళ్ల కాల వ్యవధిలో రూ. 10,000 స్టాక్ ను రూ. 2లక్షలకు పెంచింది. ఆ స్టాక్ ఎంటంటే ఎల్టీ ఫుడ్స్. ఇది గత మూడేళ్ల కాలంలో 495 శాతం తన స్టాక్ వాల్యూని పెంచుకుంది. మొత్తం మీద పదేళ్ల కాలంలో 2000శాతం లాభాలను తెచ్చిపెట్టింది.

మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఎవరైనా పెట్టుబడి దారు ఈ ఎల్టీ ఫుడ్స్ లో పదేళ్ల క్రితం రూ. 10,000 పెట్టుబడి పెడితే.. అతనికి ప్రస్తుతం రూ. లక్షలు లాభం వచ్చి ఉంటుంది. ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీ వినియోగదారుల ఫుడ్ స్పేస్ మన దేశంలోనే లీడింగ్ బాస్మతీ రైస్ బ్రాండ్స్ గా పేరుగాంచింది. ఈ ఎల్టీ ఫుడ్స్ బ్రాండ్ నేమ్ దావత్(డీఏఏడబ్ల్యూఏటీ)పేరుతో మార్కెట్లో బాస్మతీ రైస్ ని విక్రయిస్తోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్(ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్(బీఎస్ఈ)లలో దావత్ పేరుతో ట్రేడ్ అవుతోంది.

ఈ ఎల్టీ షేర్లు ఎర్నింగ్ పర్ షేర్(ఈపీఎస్) 12 నెలల బేసిస్ లో 4.74 వాల్యూ కలిగి ఉన్నాయి. అందుబాటులో ఉన్న షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ డేటా ప్రకారం బౌర్సెస్, కంపెనీ ప్రమోటర్లు 51 శాతం స్టేక్ కలిగి ఉండగా.. మిగిలిన 49శాతం సాధారణ ప్రజల పేరిట ఉంది. ఈ సాధారణ ప్రజల చేతిలో ఉన్న షేర్లలో కూడా విదేశీ పెట్టుబడిదారులు 16.13శాతం ఉండగా.. మ్యూచువల్ ఫండ్స్ 2.84శాతం స్టేక్ ను ఎల్టీ ఫుడ్స్ లో కలిగి ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంటే జూన్ 2023 నాటికి ప్రకటించిన ఫలితాల్లో ఎల్టీ ఫుడ్స్ మొత్తం ఆదాయం పది శాతం పెరిగి రూ. 1,789కోట్లకు చేరుకుంది. ఎల్టీ ఫుడ్స్ దావత్ పన్ను తీసివేయగా వచ్చిన లాభం రూ. 137కోట్లకు పెరిగింది.

స్టాక్ మార్కెట్లు చాలా రిస్క్ తో కూడుకున్నవి. మార్కెట్ ఒడుదొడుకులకు లోనవుతుంటుంది. ప్రస్తుతం లాభాల్లో ఉన్నవి.. తర్వాత కూడా కొనసాగుతాయన్న గ్యారంటీ లేదు. కానీ ఈ ఎల్టీ ఫుడ్స్ షేర్లుమాత్రం ఫుల్ జోష్ లో ఉంటున్నాయి. గత మూడేళ్లలో గణనీయమైన వృద్ధి రేటును సాధించింది. పదేళ్లలో 2000శాతం రాబడిని అందించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ