AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతి స్పెషల్‌.. మరో 3 ట్రైన్లు ఏర్పాటు చేసిన SCR.. టైమ్‌ టేబుల్‌ ఇదే!

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి, అనకాపల్లి మధ్య 3 అదనపు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చివరి నిమిషంలో ప్రయాణ ప్రణాళికలు చేసుకునే వారికి ఇవి ఎంతో ఉపశమనం కలిగిస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు 07479, 07477, 07478 నంబర్లతో నడుస్తాయి.

సంక్రాంతి స్పెషల్‌.. మరో 3 ట్రైన్లు ఏర్పాటు చేసిన SCR.. టైమ్‌ టేబుల్‌ ఇదే!
Train
SN Pasha
|

Updated on: Jan 11, 2026 | 10:34 PM

Share

సంక్రాంతి వంటి పెద్ద పండగ సీజన్‌లో ట్రైన్‌లో సీటు కాదు కదా కనీసం నిలబడేందుకు కూడా చోటు ఉండదు. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బంది తీర్చేందుకు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే చర్యలు తీసుకుంది. సంక్రాంతి పండుగ సీజన్ కారణంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి, అనకాపల్లి మధ్య 3 అదనపు ప్రత్యేక రైళ్లను

  • 07479 అనకాపల్లి టు చర్లపల్లి ఆదివారం (18.01.2026) రాత్రి 10.30 గంటలకు బయలుదేరి మరుసలి రోజు ఉదయం 11:30 గంటలకు చేరుకుంటుంది.
  • 07477 చర్లపల్లి టు అనకాపల్లి సోమవారం (19.01.2026) అర్ధరాత్రి 12.40 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది.
  • 07478 అనకాపల్లి టు చర్లపల్లి సోమవారం (19.01.2026) రాత్రి 10:30 గంటలక బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 గంటలకు చేరుకుంటుంది.

రైలు నంబర్‌ 07477/ 07478 ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లెలో ఆగుతాయి. గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి స్టేషన్లు ఇరువైపులా ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు AC 2 టైర్, AC 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కలిగి ఉంటుంది.

07479 ప్రత్యేక రైలు ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలులో AC 3 టైర్, ఎకానమీ, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి