SBI: బ్యాంకుకు వెళ్లకుండానే ఆల్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకోవచ్చు.. ఈ సింపుల్ స్టెప్స్‌తో..

మ డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఓ మంచి అవకాశం. సేవింగ్ ఖాతాతో పోలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ వస్తుండటంతో వీటిపై ఆసక్తి చూపిస్తారు. గతంలో బ్యాంకు సేవలు పొందాలన్నా, ఏవైనా వివరాలు తెలుసుకోవాలంటే నేరుగా బ్యాంకుకు..

SBI: బ్యాంకుకు వెళ్లకుండానే ఆల్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకోవచ్చు.. ఈ సింపుల్ స్టెప్స్‌తో..
SBI
Follow us

|

Updated on: Nov 12, 2022 | 9:05 AM

తమ డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఓ మంచి అవకాశం. సేవింగ్ ఖాతాతో పోలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ వస్తుండటంతో వీటిపై ఆసక్తి చూపిస్తారు. గతంలో బ్యాంకు సేవలు పొందాలన్నా, ఏవైనా వివరాలు తెలుసుకోవాలంటే నేరుగా బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి రావడంతో బ్యాంకు ఖాతా తెరవడం మొదలు ఫిక్స్‌డ్ డిపాజిట్ వరకు అన్ని బ్యాంకుకు వెళ్లకుండానే ఇంటినుంచే చేసుకునే వెసులుబాటు కలిగింది. ఓ వ్యక్తి తమ డబ్బులు పొదుపుచేసుకోవడానికి బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు అందించే సేవల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒకటి. ఎంపిక చేసుకున్న కాలపరిమితిలో సాధారణ పొదుపు ఖాతా కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తుంది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్‌బిఐ) ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను పెంచింది. స్టేట్‌బ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఖాతాదారులకు ఆన్‌లైన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరిచే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రేట్లను 80 బేసిస్ పాయింట్లు పెంచింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతుండటంతో చాలా మంది వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఆన్‌లైన్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా ఎలా తెరవాలో తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా తెరవాలనుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ముందుగా ఎస్‌బిఐ అధికారిక వెబ్ సైట్ www.onlinesbi.sbiను సందర్శించాలి. తప్పనిసరిగా నెటి బ్యాంకింగ్ కలిగి ఉండాలి. లేదంటే నెట్‌ బ్యాంకింగ్ సేవల కోసం నమోదు చేసుకోవాలి.

నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ కావడానికి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేయాలి.

ఇవి కూడా చదవండి

హోమ్ పేజీ ఎంపిక క్రింద డిపాజిట్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.

డిపాజిట్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత వాటిలో టర్మ్ డిపాజిట్ ఎంపికను ఎంచుకుని, ఆపై e-FDని సెలక్ట్ చేయాలి.

ఉన్నవాటిలో కావల్సిన పథకాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ప్రొసీడ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి.

ఏ ఖాతా నుండి డబ్బులను ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో జమ చేయాలో నిర్ణయించుకోవాలి FD ఖాతాలో జమ చేయాలో మీరు నిర్ణయించుకోవాలి.

ఎంత మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో వాల్యును ఎంచుకోవాలి. వృద్ధులు అయితే సీనియర్ సిటిజన్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ రేట్లు వేరుగా ఉంటాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి, మ్యెచురిటీ తేదీని సెలక్ట్ చేసుకోవాలి.

చివరిగా టర్మ్స్‌ అండ్ కండీషన్స్ తెలుసుకుని అక్కడి ఆప్షన్ టిక్ చేయాలి.

ఆ తర్వాత సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేసిన వెంటనే సులభంగా ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..