Banking News: ఈ రెండు బ్యాంకులు పొదుపు ఖాతా వడ్డీ రేట్లను మార్చాయి.. కొత్త రేట్లు ఇవే..!

Banking News: ప్రైవేట్ రంగానికి చెందిన యెస్ (Yes Bank) బ్యాంక్, డీసీబీ (DCB) సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను మార్చాయి. యెస్ బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ వడ్డీ రేటును..

Banking News: ఈ రెండు బ్యాంకులు పొదుపు ఖాతా వడ్డీ రేట్లను మార్చాయి.. కొత్త రేట్లు ఇవే..!
Follow us

|

Updated on: Feb 10, 2022 | 9:39 AM

Banking News: ప్రైవేట్ రంగానికి చెందిన యెస్ (Yes Bank) బ్యాంక్, డీసీబీ (DCB) సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను మార్చాయి. యెస్ బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించింది. సాధారణ సీనియర్ సిటిజన్, గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ సేవింగ్స్ ఖాతాలపై ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. కొత్త రేట్లు 8 ఫిబ్రవరి 2022 నుండి అమలులోకి వచ్చాయి. వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందేందుకు సేవింగ్స్ ఖాతాలో నెలవారీ సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఈ వడ్డీ రోజువారీగా లెక్కించబడుతుంది. కస్టమర్ సేవింగ్స్ ఖాతాలో త్రైమాసికానికి జమ చేయబడుతుంది.

ఇక DCB బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా సవరించింది. కొత్త రేట్లు 7 ఫిబ్రవరి 2022 నుండి అమలులోకి వచ్చాయి. రెసిడెంట్, నాన్ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ ఫారిన్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు కొత్త రేట్లు వర్తిస్తాయి. బ్యాంకులు ఎలైట్ సేవింగ్స్ ఖాతా, కుటుంబ సేవింగ్స్ ఖాతా, శుభ్ లాభ్ సేవింగ్స్ ఖాతా, ప్రివిలేజ్ సేవింగ్స్ ఖాతా, క్యాష్‌బ్యాక్ సేవింగ్స్ ఖాతా, క్లాసిక్ సేవింగ్స్ ఖాతా, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలను అందిస్తోంది. గూడ్స్ రిటర్న్ నివేదిక ప్రకారం..

యెస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లు

యెస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించింది. ఇక బ్యాంక్ రోజువారీ సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్ రూ. 1 లక్ష వరకు సంవత్సరానికి 4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇంతకుముందు బ్యాంకు పొదుపు ఖాతాలో రూ. 1 లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు ఉన్న డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీని చెల్లిస్తోంది. బ్యాంకు పొదుపు ఖాతా బ్యాలెన్స్ 10 లక్షల నుండి 1 కోటి వరకు 5 శాతం వడ్డీ రేటును అందించగా, ఇప్పుడు ఈ రేటు 4.75 శాతానికి చేరుకుంది. బ్యాంక్ ఇంతకుముందు 5.25 శాతం వడ్డీ రేటుతో రూ. 1 కోటి నుండి రూ. 100 కోట్ల రోజువారీ బ్యాలెన్స్ స్లాబ్‌ను కలిగి ఉంది. కానీ ఇప్పుడు బ్యాంక్ ఈ బ్యాలెన్స్ స్లాబ్‌ను రెండు విభాగాలుగా విభజించింది. యెస్ బ్యాంక్ ఇప్పుడు రోజువారీ పొదుపు ఖాతా బ్యాలెన్స్ రూ. 1 కోటి నుండి రూ. 25 కోట్ల వరకు 5 శాతం వడ్డీని, రూ. 25 కోట్ల నుండి రూ. 100 కోట్ల రోజువారీ సేవింగ్స్ బ్యాలెన్స్‌పై 5.25 శాతం వడ్డీని అందిస్తోంది.

డీసీబీ సేవింగ్స్‌ ఖాతాలపై..

బ్యాంక్ ఫిబ్రవరి 7, 2022 నుండి ఖాతాలో 1 లక్ష వరకు ఉన్న బ్యాలెన్స్‌పై 2.50 శాతం వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ప్రస్తుతం రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల మధ్య ఉన్న బ్యాలెన్స్‌పై 4.50 శాతం వడ్డీని అందిస్తోంది. ప్రస్తుతం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు ఉన్న బ్యాలెన్స్‌పై 5 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉన్న బ్యాలెన్స్‌పై 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. రూ.25 లక్షలు నుంచి రూ. 50 లక్షల బ్యాలెన్స్‌పై వడ్డీ రేటు 6.50 శాతం ఉంటుంది. రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల పొదుపు ఖాతా బ్యాలెన్స్‌పై బ్యాంక్ అత్యధికంగా 6.75 శాతం వడ్డీని అందిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Digital Voter ID Card: మీ డిజిటల్‌ ఓటర్‌ ఐడి కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాలా..? ఇలా చేయండి..!

Tesla Rrecalls: వాహనదారుల మెడకు చుట్టుకుంటున్న టెక్నికల్‌ ఎర్రర్‌.. వేలాది వాహనాలు వెనక్కి