- Telugu News Photo Gallery Business photos Redmi Note 11, Note 11S Launched in India: Check Price, Specifications
Redmi Note 11: రెడ్‌మీ నుంచి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్స్.. ఫీచర్స్, ధర వివరాలు..!
Redmi Note 11: ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న దృష్ట్యా మార్కెట్లో రోజుకో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ విడులవుతోంది. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కొత్త కొత్త ఫోన్‌లను తయారు చేస్తున్నాయి..
Updated on: Feb 10, 2022 | 11:05 AM

Redmi Note 11: ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న దృష్ట్యా మార్కెట్లో రోజుకో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ విడులవుతోంది. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కొత్త కొత్త ఫోన్‌లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లో తన స్మార్ట్‌ఫోన్‌లతో దూసుకుపోతోంది

తాజాగా కొత్త రెడ్‌మీ నోట్ సీరిస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత సంవత్సరం రెడ్‌మీ నోట్ 10ప్రో, రెడ్‌మీ నోట్ 10ప్రో మ్యాక్స్ మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు నోట్ 11 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను అదుబాటులోకి తీసుకువచ్చింది.

రెడ్‌మీ నోట్ 11 సీరిస్ మూడు స్టోరేజీ వేరియంట్లలో లభ్యమవుతోంది. 4GB ర్యామ్+64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499, 6GB+64 స్టోరేజీ ధర రూ.14,499. అలాగే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.15,999గా ఉంది.

6.43 అంగుళాల పుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే , క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 + MIUM 13 ఆపరేటింగ్ సిస్టమ్ 50 ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ+ 2 ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5,000mah బ్యాటరీ, 33w ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4G ఎల్‌టీఈ సపోర్ట్ ఉంది.





























