SSY: 21 ఏళ్లలో రూ. 70 లక్షలు.. నెలకు ఎంత సేవ్‌ చేయాలంటే..

కష్టపడి సంపాదించిన సొమ్ముకు భద్రతతో పాటు, మంచి రిటర్న్స్‌ రావాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌ పలు రకాల పథకాలను అందిస్తోంది. ఇలాంటి బెస్ట్‌ స్కీమ్స్‌లో సుకన్య నమృద్ధి యోజన ఒకటి. బాలికల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది...

SSY: 21 ఏళ్లలో రూ. 70 లక్షలు.. నెలకు ఎంత సేవ్‌ చేయాలంటే..
Ssy Scheme
Follow us

|

Updated on: Aug 12, 2024 | 6:51 PM

సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇది వారి వారి ఆదాయాలకు అనుగుణంగా మారుతుంటుంది. సంపాదించే ప్రతీ ఒక్కరూ సేవింగ్స్‌ చేయాలని ఆర్థిక నిపుణులు సైతం చెబుతుంటారు. ఒకప్పుడు కర్చు పెట్టిన తర్వాత మిగిలిన మొత్తాన్ని సేవ్‌ చేసే వారు. కానీ ప్రస్తుతం పొదుపు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు. ఇక పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి.

కష్టపడి సంపాదించిన సొమ్ముకు భద్రతతో పాటు, మంచి రిటర్న్స్‌ రావాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌ పలు రకాల పథకాలను అందిస్తోంది. ఇలాంటి బెస్ట్‌ స్కీమ్స్‌లో సుకన్య నమృద్ధి యోజన ఒకటి. బాలికల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో రూ. 250 నుంచి గరిష్టంగా ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.

ఈ పథకంలో మొత్తం 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ లభిస్తుంది. మరి ఈ పథకంలో భాగంగా రూ. 70 లక్షలు పొందాలంటే నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ కూతురు పుట్టిన రోజు నుంచే సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించి ఏటా రూ. 1.5 లక్ష డిపాజిట్ చేశారనుకుందాం. ఈ లెక్కన మీరు ప్రతీ నెల రూ. 12,500 సేవ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా 15 ఏళ్లు పెట్టుబడి పెడితే మొత్తం రూ. 22,50,000 అవుతుంది. ప్రస్తుతం ఈ పథకానికి 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో ర. 46,77,578 వడ్డీగా పొందుతారు.

దీంతో మీ కూతురు 21 ఏళ్ల నాటికి అసలు, వడ్డీతో కలిపి మొత్తం రూ. 69,27,578 అంటే సుమారు రూ. 70 లక్షలు పొందొచ్చు. ఉదాహరణకు మీరు ఒకవేళ 2024 సెప్టెంబర్‌లో ఈ పథకంలో చేరితే మీకు 2045 నాటికి రూ. 70 లక్షలు పొందొచన్నమాట. ఇక ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 1961లోని సెక్షన్ 80C కింద పన్ను ఆదా అవకాశం కూడా లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..